BiggBoss 6 Day 65 : కిందపడి, మీదపడి కొట్టుకున్న ఫైమా-ఇనయా, శ్రీహాన్ కంటెండర్ అవుతాడా ?
బజర్ మోగినపుడు ఇరు టీమ్ ల సభ్యులు తమకు ఇచ్చిన బక్కెట్ల సహాయంతో ఆ మట్టిని తీసుకొచ్చి.. పాములు, నిచ్చెనలు వీలైనంత మందంగా..
బిగ్ బాస్ సీజన్ 6లో 10వ వారం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ మొదలైంది. ఈ టాస్క్ మొత్తంమీద ఫైమా-ఇనయ హైలైట్ అయ్యారు. 65వ రోజు ప్రసారమైన ఎపిసోడ్ లో.. కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు కోసం ఇంటి సభ్యులను రెండుటీమ్ లుగా విడగొట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ పేరు స్నేక్ అండ్ ల్యాడర్. స్నేక్ టీమ్ లో.. ఫైమా, శ్రీహాన్, రోహిత్, వసంతి, ఆదిరెడ్డి, కీర్తి ఉండగా.. ల్యాడర్ టీమ్ లో .. రేవంత్, రాజ్, ఇనయా, శ్రీసత్య, బాలాదిత్య, మెరీనా ఉన్నారు. ఈ టాస్కుకు ఇనయా, ఫైమా లు సంచాలకులుగా ఉంటారని బిగ్ బాస్ తెలిపాడు. టాస్కులో భాగంగా బాల్కనీలో పాములు, నిచ్చెనల ఆకారాలు ఏర్పాటు చేశారు. వాటికి ఎదురుగా ఆవల వైపు ఒక గదిలా ఉంచి.. అందులో మట్టిని ఉంచారు.
బజర్ మోగినపుడు ఇరు టీమ్ ల సభ్యులు తమకు ఇచ్చిన బక్కెట్ల సహాయంతో ఆ మట్టిని తీసుకొచ్చి.. పాములు, నిచ్చెనలు వీలైనంత మందంగా, బలంగా కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాము సౌండ్ వినిపించినపుడు పాముల టీమ్ లో ఎవరోఒకరు నిచ్చెనల టీమ్ సభ్యులపై దాడిచెేసి వారి నిచ్చెనలోని మట్టిని తెచ్చుకోవచ్చు. ఈ టాస్క్ లో కీర్తి.. రాజ్ పై ఎటాక్ చేసేందుకు ప్రయత్నించింది కానీ.. ఆమె చేయి బాలేకపోవడంతో సాధ్యపడలేదు. ఇనయా మీదికి ఫైమా.. ఫైమా మీదికి ఇనయా దాడి చేసుకున్నారు. తొలి రౌండ్ లో శ్రీసత్య, రోహిత్ లు తక్కువ మట్టి ఉన్నకారణంగా గేమ్ నుండి అవుటయ్యారు. ఇక రెండో రౌండ్ లో ఫైమా ఇనయాను తొలగించగా.. ఇనయ వాసంతిని గేమ్ నుండి తొలగించింది.
రెండు రౌండ్లు ముగిసే సరికి.. శ్రీసత్య, రోహిత్, ఇనయ, వాసంతిలు అవుటయ్యారు. ఇక.. ఫైమా- ఇనయా ల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ రోజు వచ్చే ఎపిసోడ్ ఎవరెవరు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారో చూడాలి.