BiggBoss 6 Day 92 : ఈవారం నామినేషన్ లిస్ట్ ఇదే.. టాప్ 7లో ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉన్నారో చూడండి

ఆ తర్వాత ఒకటి నుండి 7 వరకూ నంబర్ స్టాండ్స్ పెట్టి.. ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉంటారు ? ఎందుకు ఉంటారో కారణాలు చెప్పాలని..;

Update: 2022-12-06 06:47 GMT
biggboss 6 day 92, bigg boss nominations

biggboss 6 day 92

  • whatsapp icon

బిగ్‌బాస్ సీజన్ 6 ఆఖరి దశకు చేరుకుంది. 21 మందితో మొదలైన ఈ సీజన్లో.. ప్రస్తుతం ఏడుగురు మిగిలారు. ఆల్రెడీ శ్రీహాన్ ఫైనల్ కి చేరడంతో.. మిగతా ఆరుగురూ ఈవారం నామినేషన్స్ లో ఉన్నారు. రేవంత్‌, ఇనయ, శ్రీ సత్య, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్‌ లు ఈ వారం నామినేషన్స్ లో నిలిచారు. 92వరోజు ప్రసారమైన ఎపిసోడ్ లో.. శ్రీహాన్-శ్రీసత్య ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. శ్రీహాన్ తాను మొదటి నుండి ఒకేలా ఉన్నానని.. నువ్వు చాలా మారిపోయావ్ అని సత్యతో వాదించాడు.

ఆ తర్వాత ఒకటి నుండి 7 వరకూ నంబర్ స్టాండ్స్ పెట్టి.. ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉంటారు ? ఎందుకు ఉంటారో కారణాలు చెప్పాలని అడిగాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ ఒక్కొక్కరు ఒక్కో నంబర్ పై నిలబడి తామెందుకు అందుకు అర్హులమో చెప్పారు. చివరికి రేవంత్‌ మొదటి స్థానం, శ్రీహాన్‌ రెండో స్థానం, ఆదిరెడ్డి మూడు, ఇనయ నాలుగు, శ్రీ సత్య ఐదు, రోహిత్‌ ఆరు, కీర్తికి ఏడో స్థానం దక్కాయి.
ఇక మిగతా ఇంటి సభ్యులకు కొత్తకొత్త టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. విన్నర్ ప్రైజ్ మనీ నుండి కోల్పోయిన డబ్బును తిరిగి దక్కించుకునేందుకు బిగ్ బాస్ కొత్త ఛాలెంజ్ లు ఇస్తున్నాడు. ఈ టాస్కులు ముగిసేసరికి ఎంతమనీని తిరిగి దక్కించుకుంటారో చూడాలి.



Tags:    

Similar News