బుజ్జమ్మ నా లవర్ కాదు : బిగ్ బాస్ 6 ఆర్జే సూర్య

తర్వాతిరోజు జరిగిన నామినేషన్స్ లో అందరూ ఇనయనే టార్గెట్ చేశారు. నువ్వు నామినేట్ చేసినందుకే సూర్య ఎలిమినేట్ అయ్యాడన్న..;

Update: 2022-11-03 11:34 GMT
surya bujjamma, rj surya lover bujjamma

rj surya about bujjamma

  • whatsapp icon

బిగ్ బాస్ సీజన్ 6లో రెండువారాలుగా హౌస్ మేట్స్ నువ్వా నేనా అన్నట్టుగా ఆడుతున్నారు. ఈవారం టాస్కుల్లో హీట్ మరింత పెరిగింది. ఎదుటివారి పర్సనల్ టాపిక్స్ మాట్లాడుతూ.. నోరుజారుతూ.. తిట్టుకుంటూ ఆడుతున్నారు. ఇక గతవారం సూర్య ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. రొటీన్ కి భిన్నంగా.. శనివారం నాటి ఎపిసోడ్ లోనే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. సూర్య ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటికి వచ్చేముందు ఇనయ ముద్దుల వర్షం కురిపించింది. ఇది హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ కీ నచ్చలేదు.

తర్వాతిరోజు జరిగిన నామినేషన్స్ లో అందరూ ఇనయనే టార్గెట్ చేశారు. నువ్వు నామినేట్ చేసినందుకే సూర్య ఎలిమినేట్ అయ్యాడన్న కారణంతో ఇనయకు ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. ఆ తర్వాత ఇనయ ఎవరికీ కనిపించకుండా బాత్రూమ్ లోకి వెళ్లి బోరున ఏడ్చింది. ఆమె డ్రామా చేస్తుందని ఆడియన్స్ అభిప్రాయం. తాజాగా సూర్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బుజ్జమ్మ తనకి లవర్ కాదంటూ షాకిచ్చాడు. తామిద్దరం 8 సంవత్సరాలుగా స్నేహితులమని.. ప్యూర్ ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. 
బుజ్జమ్మ తన లవర్ అంటూ వచ్చిన వీడియోలను చూసి షాకయ్యానని ఇకపై అలా రాయొద్దని తెలిపాడు.

హౌస్ లో ఉన్నవారిలో ఎవరైనా ప్రపోజ్ చేస్తే అంగీకరిస్తారా అని ఇనయని ఉద్దేశించి అడగ్గా.. తనకు అలాంటిదేమీ లేదని చెప్పాడు సూర్య. ఇంట్లో చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్పాడు. మరి హౌస్ లో ఉన్నపుడు ఆరోహి.. సూర్యకు బయట బుజ్జమ్మ ఉంది.. తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని ఎందుకు చెప్పింది ? అలాగే సూర్య ఇనయతో కూడా ఇదే మాట అన్నాడు. హౌస్ లో చెప్పింది నిజమా..? బయట చెప్పింది నిజమా ? ఏదేమైనా నువ్వు పులిహోర రాజాలా ఉన్నావ్ సూర్య అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News