గౌతమ్ అదానీపై న్యూయార్క్ లో కేసు నమోదు

ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై న్యూయార్క్ లో కేసు నమోదయింది.;

Update: 2024-11-21 02:50 GMT

ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై న్యూయార్క్ లో కేసు నమోదయింది. బిలియన్ డాలర్ల మోసానికి పాల్పడినట్లు అదానీపై కేసు నమోదయింది. గౌతమ్ అదానీతో పాటు ఆయన బంధువు సాగర్ తో సహా మరో ఏడుగురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లంచం ఇవ్వచూపి...
గత ఇరవై ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత్ అధికారులకు 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ కేసు నమోదయింది. అదానీ కంపెనీ రుణదాతలు, పెట్టుబడి దారుల నుంచి మూడు బిలియన్ డాలర్లకు పైగా రుణాలను, బాండ్లను సేకరించిందన్న అభియోగాలను అదానీ ఎదుర్కొంటున్నారు.


Tags:    

Similar News