Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... దిగి వచ్చిన బంగారం ధరలు ఎంతంటే?
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది;

బంగారం ధరలు ఎండలతో పాటు పోటీ పడుతున్నాయి. ఎంతగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మండి పోతున్నట్లుగానే బంగారం కూడా ధరలు మండిపోతున్నాయి. అసలు పెరుగుదల అనేది ఆగడం లేదు. ప్రతి రోజూ ఎంత ధర పెరుగుతుందోనన్న ఆందోళన వినియోగదారుల కంటే ముందు వ్యాపారుల్లో నెలకొంది. ఈ ఏడాది ఆరంభం నుంచి వరసగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు స్వల్పంగా తగ్గి ఊరట కలిగించినా భారీగా పెరుగుదలతో ఇబ్బందులను తెచ్చి పెడుతున్నాయి. పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో బంగారాన్ని కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే అమ్మకాలు పెద్దగా జరగడం లేదు.
అక్షర తృతీయ కూడా...
పెళ్లిళ్ల సీజన్ తో పాటు అక్షర తృతీయ కూడా వస్తుండటంతో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు భావించినా ఆశించినంత మేరకు జరగడం లేదు. ట్రంప్ విధిస్తున్న సుంకాల కారణం ప్రభావం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతుందంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలొకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గుదలలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు ఎప్పుడు కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్న వారికి ఇప్పట్లో అంత అవకాశం కనిపించేందుకు ఛాన్స్ లేదు.
స్వల్పంగా తగ్గి...
బంగారం అంటే ఇప్పుడు బరువుగా మారింది. ఇంత ధరలను పెట్టి కొనుగోలు చేయడాన్ని అనేక మంది వెనుకంజ వేస్తున్నారు. వ్యాపారులు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాలని కోరుకుంటున్నారు. అప్పుడే అమ్మకాలు పెరుగాయి. మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తేనే బంగారం విక్రయాలు ఊపందుకుంటాయి. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,690 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రామలు బంగారం ధర 95,660 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,09,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.