Gold Price Today : తగ్గింది కూసింత.. పెరిగింది కొండంత.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది;

బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. ఎందుకో తెలియదు కానీ.. పసిడి ధరలు మాత్రం మార్కెట్ నిపుణుల అంచనాలకు కూడా ఎప్పుడూ అందవు. ఇటీవల కాలంలో బంగారం ధరలు పూర్తిగా పతనమవుతాయని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. పది గ్రాముల బంగారం ధర యాభై ఐదు వేల రూపాయకు చేరుకుంటుందని నిపుణులు చెప్పారు. కానీ అందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం బంగారం ధరలు మాత్రం అమాంతంగా పెరిగి వినియోగదారులకు షాక్ కు గురి చేస్తున్నాయి. తగ్గడం మాట అలా ఉంచి పెరగకూడదని భావించే పరిస్థితికి వచ్చింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు దిగి వచ్చే అవకాశం లేదని పెరుగుతున్న రేట్లను బట్టి ఇట్టే చెప్పవచ్చు. ఇక వచ్చేకాలమంతా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింతగా పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. శుభకార్యాలకు, పెళ్లిళ్లకు తప్పనిసరిగా బంగారం, వెండి కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుండటంతో వాటి ధరలను అదుపు చేయడం ఎవరి వల్లా కాదు. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తగ్గింది కొంతే అయితే పెరిగింది మాత్రం కొండంత అన్నట్లుగా బంగారం పరిస్థితి ఉంది. దీంతో కొనుగోలు దారులు బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడిపోతున్నారు. తమకు అవసరానికి సరిపడా కొనుగోలు చేయడం అలవాటు చేసుకున్నారు.
ధరలు అదుపులో లేక...
బంగారం ఇప్పుడు ధరలు అందుబాటులో లేకపోవడంతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ స్థాయిలో బంగారం ధరలు ఎన్నడూ పెరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పది గ్రాముల బంగారం ధర 96 వేల రూపాయలకు చేరువలో ఉంది. కిలో వెండి ధర లక్షా పది వేల రూపాయలకు చేరుకుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరలు ఇలా ఉన్నాయి. అయితే మధ్యాహ్నానికి ధరలు మరింత పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,700 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,670 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,10,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.