Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు తెలిస్తే కొనుగోలు చేస్తారంతే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది;

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని ముందు నుంచి మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు భారీగా పతనమవుతాయని మరికొందరు అంచనా వేస్తున్నప్పటికీ అది వాస్తవ రూపం దాల్చే అవకాశం అస్సలు కనిపించడం లేదు. పది గ్రాముల బంారం ధర యాభై ఐదు వేల రూపాయలకు చేరుకుంటుందని పలువురు బిజినెస్ నిపుణులు అంచనా వేశారు. దీంతో అనేక మంది కొనుగోలుదారులు ధరలు తగ్గుతాయేమోనని ఎదురు చూస్తున్నారు. కానీ ధరలు తగ్గడం మాట అటుంచి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇలా పెరుగూ పోతే ఈ ఏడాది ఇంకా కొన్ని నెలలు మిగిలి ఉండగానే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకునే అవకాశాలున్నాయి.
ఆభరణాలపైనే...
దక్షిణ భారత దేశంలో గోల్డ్ బాండ్స్ కంటే ఎక్కువ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విదేశాల్లో ఎక్కువగా గోల్డ్ బాండ్స్ ను కొనుగోలు చేస్తుంటారు. విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన బంగారం నిల్వలు సక్రమంగా దిగుమతి కాకపోవడంతో డిమాండ్ కు సరిపడా బంగారం నిల్వలు లేకపోవడంతోనే ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో సంభవించే పరిణామాలు కూడా ధరల్లో మార్పులు రావడానికి కారణంగా చెబుతున్నారు. అయితే ఈ ఏడాది పసిడి ప్రియులకు అచ్చి రావడం లేదు. ఏడాది ప్రారంభం నుంచే ధరలు పెరగడం ప్రారంభించి ఇక ఆగకుండా పరుగులు పెడుతూనే ఉన్నాయి.
స్వల్పంగా తగ్గి...
బంగారం ధరలతో పోటీ పడి వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర 95 వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్షా తొమ్మిది వేల రూపాయలుగా ఉంది. ఇంతగా ధరలు ఉంటే ఎవరు మాత్రం కొనుగోలు చేస్తారు. అందుకే బంగారం, వెండి ఆభరణాల అమ్మకాలు గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోయాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,540 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,500 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,09, 800 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.