దేశంలోని ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కపైసా కూడా ట్యాక్స్‌ చెల్లించరు.. కారణం ఏంటంటే..

Income Tax:ప్రభుత్వం ఆదాయ పన్ను విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తుంటుంది. ఆదాయ పన్ను ఎగ్గొట్టే వారిని దృష్టిలో ఉంచుకుని..

Update: 2024-01-13 14:40 GMT

Income tax

Income Tax:ప్రభుత్వం ఆదాయ పన్ను విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తుంటుంది. ఆదాయ పన్ను ఎగ్గొట్టే వారిని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు మరింత కఠిన తరం చేసింది. దీంతో ట్యాక్స్‌ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్‌ చెల్లించాల్సిందే. ప్రతినెల ఆదాయపు పన్ను వసూళ్లు భారీగానే వస్తున్నాయి. దేశంలో ప్రత్యేక వ్యవస్థ ఉంది. పౌరులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఆదాయపు పన్ను చెల్లించాలి. కానీ దేశంలోని ఓ రాష్ట్ర ప్రజలు మాత్రం ఒక్కపైసా కూడా ట్యాక్స్‌ చెల్లించరు. అదేంటి వారెందుకు చెల్లించనేగా మీ అనుమానం. అసలు వారు ట్యాక్స్‌ ఎందుకు చెల్లించరో తెలుసుకుందాం.భారతదేశంలోని సిక్కిం రాష్ట్ర పౌరులలో 95 శాతం మంది తమ కోట్ల ఆదాయంపై ఒక్క పైసా కూడా పన్నుల రూపంలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇక్కడి స్థానికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది.

రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం.. తూర్పు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వచ్చింది. ఇండియన్ యూనియన్‌లో విలీన సమయంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకే ఇక్కడ ఆదాయపు పన్ను రహితమైనవిగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఎ ప్రకారం ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చింది. ఇతర పౌరులు ఈ రాష్ట్రంలో ఆస్తిని కొనుగోలు చేయలేరు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10 (26AAA)ప్రకారం సిక్కిం రాష్ట్ర ప్రజలు ఆదాయపు పన్ను మినహాయింపు పొందుతున్నారు.

1975లో సిక్కిం విలీనం

సిక్కిం 1642లో స్థాపన జరిగింది. 1975లో ఈ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. 1950లో భారత్-సిక్కిం శాంతి ఒప్పందం కుదిరింది. 1948లో సిక్కింలోని చోగ్యాల్ పాలకులు దేశంలో ఆదాయపు పన్ను చెల్లించకూడదని నిర్ణయించుకున్నారు. భారత్‌తో విలీన సమయంలో ఈ షరతు అలాగే ఉండిపోయింది. భారతీయ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 (26AAA) ప్రకారం స్థానిక పౌరులకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంది. అప్పటి నుంచి ఎవ్వరు కూడా ట్యాక్స్‌ చెల్లించరు.

ఇక ఆదాయపు పన్ను మినహాయింపుతో పాటు, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా సిక్కిం పౌరులకు పాన్ కార్డు వినియోగానికి సంబంధించి మినహాయింపు ఇచ్చింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడానికి పాన్ కార్డ్ అవసరం. సిక్కిం పౌరులు పాన్ కార్డ్ లేకుండా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు.

Tags:    

Similar News