Gold Price Today: బంగారం విషంయలో ప్రియమైన కబురు.. ధరల నేల చూపులు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పు కనిపించింది

Update: 2024-12-30 02:52 GMT

బంగారం ధరలు ఎప్పుడూ తగ్గవు. అరుదుగా మాత్రమే తగ్గి కొంత ఊరట కల్గిస్తాయి. అదే సమయంలో వెండి ధరలు కూడా కాస్తంత పరుగు తగ్గించడం వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చూడాలి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. వెండి ధరలు కూడా దాదాపు లక్షకు సమీపానికి వెళ్లాయి. సీజన్ లో ధరలు పెరగడం చూసి ఇక కొత్త ఏడాది ధరలు మరింత పెరుగుతాయని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్న సమయంలో తీపి కబురు లభించందనే చెప్పాలి. అయితే అనుకున్నట్లే భారీ స్థాయిలో మాత్రం ధరలు తగ్గలేదు. ధరలు తగ్గింది స్వల్పంగానే. అయినా సరే పెరగకపోవడం ఊరటేగా అంటున్నారు వ్యాపారులు.


విశ్వవ్యాప్తంగా...

బంగారం, వెండి వస్తువులకు మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. కేవలం ఆభరణాల కోసం కొనుగోలు చేసేవారు మాత్రమే కాకుండా పెట్టుబడిగా బంగారంపై మదుపు చేస్తూ నాలుగు చేతలా సంపాదించే వాళ్లు అనేక మంది ఉన్నారు. విదేశాల్లో ఎక్కువగా గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయడం అలవాటు. కానీ మనదేశంలో మాత్రం ఆభరణాలకు మాత్రమే ఎక్కువగా పరిమితమవుతారు. అందుకే ఇక్కడ దుకాణాల సంఖ్య కూడా ఎక్కువ. గోల్డ్ ఏటీఎం ల నుంచి కూడా ఎక్కువ మంది తమకు అవసరమైన బంగారాన్ని తీసుకుంటుండటం ఈ మధ్య కాలంలో పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ఆభరణాల కొనుగోళ్లు కొంత మేర తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
ధరలు తగ్గినా...
దీనికి ప్రధాన కారణం ధరలు అందనంత దూరంగా వెళ్లడమే. అందుకే ధరలు తగ్గితే వినియోగదారులు కూడా బంగారం కొనుగోలు పట్ల ఆసక్తి చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే కొత్త ఏడాది ప్రారంభంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పు కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,340 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,830 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,800 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.





Tags:    

Similar News