బోల్తా పడిన వ్యాన్.. 8 మంది అయ్యప్ప భక్తులు మృతి
మృతులంతా తమిళనాడులోని థేని, అండిపెట్టికి చెందిన అయ్యప్పస్వాములుగా గుర్తించారు. శుక్రవారం రాత్రి పదకొండు గంటల
కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న వ్యాన్ కేరళ-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డు పక్కనే ఉన్న 40 అడుగుల గోతిలో వ్యాన్ పడిపోవడంతో.. అందులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతులంతా తమిళనాడులోని థేని, అండిపెట్టికి చెందిన అయ్యప్పస్వాములుగా గుర్తించారు. శుక్రవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి. మురళీధరన్ మృతుల కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేశారు. వ్యాన్ బోల్తా పడి 8 మంది మరణించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ట్వీట్ చేశారు.