అంబులెన్సు కి దారి ఇవ్వనందుకు రూ.2.5 లక్షల జరిమానా..!!

కేరళలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోగిని తీసుకుని వెళ్తున్న అంబెలెన్సుకి ఒక కారు యజమాని దారి ఇవ్వలేదు.

Update: 2024-11-17 07:59 GMT

కేరళలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోగిని తీసుకుని వెళ్తున్న అంబెలెన్సుకి ఒక కారు యజమాని దారి ఇవ్వలేదు.పేషంట్ ని అత్యవసరంగా హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాల్సి రావటంతో డ్రైవర్ హారన్ మోగిస్తూనే ఉన్నాడు.. ఎదురుగా వస్తున్న అన్ని వాహనాలు దారి ఇవ్వగా,ఒక కారు యజమాని మాత్రం దారి ఇవ్వకుండా అలాగే వెళ్తున్నాడు..

ఈ విషయాన్ని అంబులెన్సు ముందు భాగంలో కూర్చున్న వైద్య సిబ్బంది వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వెంటనే వైరల్ అయింది... వెంటనే స్పందించిన పోలీసులు,ఆ కారు యజమాని వివరాలు తెలుసుకుని, ఇంటికి వెళ్ళారు..

అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తూ, రూ. 2.5 లక్షలు జరిమానా విధించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది..!!



Tags:    

Similar News