స్టూడెంట్స్ కు పోర్న్ వీడియోలను పంపుతున్న లెక్చరర్

Update: 2022-10-20 07:01 GMT

సోషల్ మీడియాలో విద్యార్థికి పోర్న్ వీడియోలు పంపినందుకు బెంగళూరులోని ప్రముఖ కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌పై కర్ణాటక పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. నిందితుడిని మధుసూధన్ ఆచార్యగా గుర్తించామని, అతను వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంపాడని పోలీసులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (NCMEC) ఈ విషయాన్ని గుర్తించి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB)కి సమాచారం అందించిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఎన్‌సీఆర్‌బీ కర్ణాటక పోలీసు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)కి సమాచారం అందించింది. ప్రస్తుతం ఈ కేసును సౌత్ ఈస్ట్ సైబర్ ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ (CEN) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అతడిని విచారించగా తన నేరాన్ని అంగీకరించాడు.


Tags:    

Similar News