హైదరాబాద్ కుట్ర కేసు భగ్నం.. ఒకరి అరెస్ట్

హైదరాబాద్ కుట్ర కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ముసారాంబాగ్ కు చెందిన జాహెద్ ను అదుపులోకి తీసుకున్నారు

Update: 2022-10-02 09:13 GMT

హైదరాబాద్ కుట్ర కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ముసారాంబాగ్ కు చెందిన జాహెద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలపై దాడులకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై జావేద్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఉగ్రవాద కార్యక్రమాల కోసం యువతను రిక్రూట్ మెంట్ చేస్తున్నారన్న ఆరోపణలు జావేద్ పై ఉన్నాయి. ఆరుగురు యువకులను ఇందుకోసం జావేద్ రిక్రూట్ చేశారని పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ జావెద్ ను పోలీసులు విచారించి వదిలేశారు.

ఎక్కడికి తీసుకెళ్లారో?
ఉగ్రవాద సంస్థలతో జావేద్ కు లింకులున్నాయన్నది పోలీసుల అభియోగం. మక్కామసీదు పేలుళ్ల కేసులోనూ జావెద్ పై ఆరోపణలు గతంలో వచ్చాయి. అయితే తమ కుమారుడిని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు తీసుకెల్లారని, ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని జావేద్ తల్లి హఫీజున్నీసా కోరుతున్నారు. తమ కుమారుడి ఆచూకి చెప్పాలంటూ ఆమె పోలీసులను కోరుతున్నారు. పోలీసులు తీసుకెళ్లారా? మరెవరైనా కిడ్నాప్ చేశారా? అన్న అనుమానం ఆమె వ్యక్తం చేస్తుంది.


Tags:    

Similar News