రహదారిపై విరిగిపడిన మంచు చరియలు
సిక్కింలో గ్యాంగ్‌టక్ నుంచి నాథులా వెళ్లే హైవేపై మంచు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది
సిక్కింలో గ్యాంగ్‌టక్ నుంచి నాథులా వెళ్లే హైవేపై మంచు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అనేక మంది గాయపడ్డారు. మంచుకొండలు రహదారిపై పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి మంచును తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఏడుగురు మృతి...
గాయపడిన 23 మందిని రెస్క్యూ టీమ్ కాపాడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించింది. నాథులా పర్వత మార్గంలో భారీగా మంచు కురుస్తుండటంతో ఎనభై వాహనాల్లోని 350 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.