అమ్మాయిల ప్రొఫైల్ ఫోటోలు.. ఇంత నీచానికి పాల్పడుతారా?
అమ్మాయిలు ఆన్ లైన్ లో ఎన్నో రకాల వేధింపులను ఎదుర్కొంటూ ఉన్నారు. కొందరు ప్రేమించమని
అమ్మాయిలు ఆన్ లైన్ లో ఎన్నో రకాల వేధింపులను ఎదుర్కొంటూ ఉన్నారు. కొందరు ప్రేమించమని వెంటపడుతూ ఉంటే.. ఇంకొందరేమో బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. తల్లిదండ్రులకు ఈ విషయాలను చెబితే ఎక్కడ తమ స్వేచ్ఛకు అడ్డుపడతారో అని కూడా అమ్మాయిలు భయపడుతూ ఉన్నారు. ఇలాంటి సమయాల్లో ఏమి చేయాలో తెలియక ఇద్దరు అమ్మాయిలు ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
నల్గొండలో ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లికి చెందిన శివాని, అదే మండలంలోని అమ్మనబోలుకు చెందిన మనీషా నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ సెకండియర్ చదువుతున్నారు. వసతిగృహంలో ఉంటున్న వారు కాలేజీకి వెళ్తున్నట్టు చెప్పి ఓ ఫర్జిలైజర్ దుకాణంలో పురుగు మందు కొనుక్కున్నారు. ఆ తర్వాత రాజీవ్ పార్క్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత పురుగుల మందును తాగారు. అనంతరం శివాని తన తండ్రికి ఫోన్ చేసి తనను క్షమించాలని, పురుగు మందు తాగానని చెప్పింది. మనీషా కూడా తన స్నేహితులకు ఫోన్ చేసి పురుగుల మందు తాగినట్లు తెలిపింది. ఇద్దరూ పార్క్ బయటకు వచ్చి స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మేజిస్ట్రేట్ ఆసుపత్రికి వచ్చి వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
వారు ఈ నిర్ణయం తీసుకోడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడి వేధింపులే కారణమని తెలుస్తోంది. వాట్సప్ అకౌంట్‌కు డీపీగా పెట్టుకున్న ఫొటోలని అశ్లీలంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.