Parliament Attack : కీలక సూత్రధారికి పోలీసు కస్టడీకి అనుమతి

పార్లమెంటులో దాడి కీలక సూత్రధారి లలిత్ ఝాకి పాటియాలా హౌస్ న్యాయస్థానం ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది.

Update: 2023-12-15 12:33 GMT

lalit jha parliament attack

పార్లమెంటులో దాడి కీలక సూత్రధారికి పాటియాలా హౌస్ న్యాయస్థానం ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. పార్లమెంటులో దాడి కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాని పదిహేను రోజులు రిమాండ్ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోరారు. తాము లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానానికి పోలీసులు తెలిపారు. అయితే ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తిని కొంత వరకూ పరిశీలించిన పాటియాలా హౌజ్ కోర్టు పోలీస్ కస్టడీని ఏడు రోజులకు మాత్రమే పరిమితం చేసింది.

ఏడు రోజులు...
ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న లలిత్ ఝా నిన్న పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయాడు. నిందితుల వద్ద ఉన్న సెల్ ఫోన్లంటినీ ఇతగాడే రిమాండ్ విధించింది. అయితే వీరంతా మణిపూర్ అంశం, రైతుల నిరసన, నిరుద్యోగం వంటి అంశాలపై నిరసన తెలుపుతూ దాడికి పాల్పడ్డారని పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడయినట్లు తెలిసింది.


Tags:    

Similar News