Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళల స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు;

Update: 2025-04-13 03:55 GMT
road accident, three women died, sri sathya sai district, andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. జిల్లాలోని ధనపురం క్రాస్వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించారు. మృతులు అలివేలమ్మ, ఆదిలక్ష్మమ్మ, శాకమ్మలుగా గుర్తించారు.

ఆటోను ఢీకొట్టడంతో...
ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం పథ్నాలుగు మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. వీరంతా దొడగట్ట వాసులుగా గుర్తించారు. సత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన మరో 10 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.


Tags:    

Similar News