ప్రిన్సిపల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్టూడెంట్.. ఎందుకంటే
ప్రిన్సిపల్ - విద్యార్థి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ..
ఓ విద్యార్థి.. కోపం పట్టలేక ప్రిన్సిపల్ పై దారుణానికి పాల్పడ్డాడు. మార్కుల మెమో ఇవ్వకుండా వేధిస్తున్న ప్రిన్సిపల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ భూపాల్ లోని పీఎమ్ ఫార్మసీ కాలేజీలో చోటుచేసుకుంది. అశుతోష్ శ్రీవాత్సవ అనే విద్యార్థి గతేడాది ఆ కాలేజీలో బీ ఫార్మసీ పూర్తి చేశాడు. మార్క్స్ మెమో ఇవ్వకుండా మహిళా ప్రిన్సిపల్ అశుతోష్ ను ఇబ్బందులకు గురిచేసింది.
నిన్న (ఫిబ్రవరి 20) సాయంత్రం 4 గంటల సమయంలో విద్యార్థి కాలేజీకి వెళ్లి.. తన మార్కుల మెమో కావాలని అభ్యర్థించాడు. ఇవ్వడం కుదరదనడంతో.. ప్రిన్సిపల్ - విద్యార్థి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ప్రిన్సిపల్ పై పోసి నిప్పంటించాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు రక్షించారు. తీవ్రగాయాల పాలైన ఆ మహిళా ప్రిన్సిపల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విద్యార్థి కూడా కాలిన గాయాలకు చికిత్స తీసుకుంటున్నాడు. కాగా.. కొన్ని నెలలక్రితం కూడా అశుతోష్ కాలేజీ ఫ్యాకల్టీపై కత్తితో దాడిచేసి జైలుకెళ్లి, వారంరోజుల క్రితమే బెయిల్ పై విడుదలయ్యాడు.