అమానుషం.. రైల్వే ట్రాక్ పక్కన 10 రోజుల పసికందు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పది రోజుల పసికందులు అమానుషంగా తల్లిదండ్రులు నడిరోడ్డుపై వదిలి వెళ్లారు

Update: 2023-07-22 09:39 GMT

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పది రోజుల పసికందులు అమానుషంగా తల్లిదండ్రులు నడిరోడ్డుపై వదిలి వెళ్లారు... పసిపాప ఏడుపు వినిపిస్తూ ఉండడంతో స్థానికులు ఘటన స్థలానికి వెళ్లి చూడగా కేవలం పది రోజుల పాప కనిపించడంతో వారి హృదయం చలించిపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. జమైకా ఉస్మానియా రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని ఓ తల్లిదండ్రులు 10 రోజుల పాపను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు.

హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు వెంటనే 10 రోజుల పాపను చేరదీసి సోమాజి గూడ చైల్డ్ హోమ్ కు తరలించారు. అసలు ఈ పాపను వదిలివేసిన తల్లిదండ్రులు ఎవరు? ఆడపిల్ల అని ఈ పాపను వదిలేసారా? లేక మరే కారణాలవల్లనైన పాపను ఇక్కడ వదిలేశారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. 


Tags:    

Similar News