జైలులో ఖైదీల మధ్య ఘర్షణ... 20 మంది మృతి
ఈక్వెడార్ జైలులో విషాదం చోటు చేసుకుంది. ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది మరణించారు.
ఈక్వెడార్ జైలులో విషాదం చోటు చేసుకుంది. ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది మరణించారు. ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఘర్షణలకు జరిగిన కారణాలు తెలియరాలేదు. అయితే ఈ ఘర్షణల వెనక రాజకీయపరమైన కారణాలున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఖైదీల మధ్య ఘర్షణలో ఇరవై మంది మరణించినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శఆఖ మంత్రి ప్యాట్రికో కారిల్లో తెలిపారు.
మారణాయుధాలతో.....
ఈక్వెడార్ జైలులో ఖైదీలు మారణాయుధాలతో దాడులు చేసుకోవడం కలకలం రేపింది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడంతో పెద్ద సంఖ్యలో మరణించారు. ఈ ఘర్షణలను అదుపు చేసేందుకు పెద్దయెత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం ఈక్వెడార్ జైలులో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని అధికారులు చెప్పారు. అయితే ఈక్వెడార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణలు జరగడం కొత్తేమీ కాదు. రెండేళ్ల క్రితం జరిగిన ఘర్షణలో 316 మంది ఖైదీలు మరణించారు.