జూదానికి బానిసైన మహిళ.. బెట్ లో ఓడి ఆమె చేసిన పనికి భర్తకు ఫ్యూజులు ఎగిరిపోయాయి
ప్రతాప్ గఢ్ కొత్వాల్ లో అద్దె ఇంటిలో నివాసం ఉండే వివాహిత లూడో గేమ్ కి బానిసయింది. భర్త ఉద్యోగ రీత్యా జైపూర్ లో ఉంటాడు
జూదానికి బానిసై.. ఉన్న ఆస్తినంతా అందులో పెట్టి కోల్పోయిన వారు కోకొల్లలు. తీరా అంతా పోయాక ఇలా ఎందుకు చేశామా అని బాధపడుతుంటారు. డబ్బు, నగలు, బంగారం, ఆఖరికి ఒంటిపై ఉండే బట్టల్ని కూడా పందెంలో పెట్టి జూదంలో ఓడిపోయినవారున్నారు. కానీ.. ఓ మహిళ అంతకు మించిన పని చేసింది. ఇంటి ఓనర్ తో లూడో గేమ్ బెట్ కట్టింది. ఇంతకీ బెట్ ఏంటంటే.. ఓడిపోతే ఆమె అతని వశమవ్వాలి. ఇదేమంత షాకయ్యే బెట్ కాదంటారా ? వినేవారికి కాకపోవచ్చు కానీ.. ఈ విషయం తెలిసి ఆ మహిళ భర్తకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ప్రతాప్ గఢ్ కొత్వాల్ లో అద్దె ఇంటిలో నివాసం ఉండే వివాహిత లూడో గేమ్ కి బానిసయింది. భర్త ఉద్యోగ రీత్యా జైపూర్ లో ఉంటాడు. ఆరునెలల క్రితం అక్కడికి వెళ్లాడు. నెలనెల సంపాదించిన డబ్బును ఆమెకు పంపేవాడు. ఖాళీగా ఉన్న ఆ గృహిణి..ఆన్ లైన్, స్నేహితులు, తెలిసినవారందరితో లూడో గేమ్ లో బెట్ లు కట్టేది. తన భర్త ఇంటిలో లేనప్పుడు ఇంటి యజమానితో కలిసి లూడో ఆడేది. ఈ ఆటలో ఆమె చాలా డబ్బు పొగొట్టుకుంది. భర్త పంపిన డబ్బులన్నీ అయిపోవడంతో చివరికి ఆమె తనపైనే పందెం కాసింది. ఆ ఆటలోనూ ఓడిపోవడంతో.. ఆమె ఇంటి యజమాని వశమైంది. ఇక ఆ తర్వాత అది సహజీవనం మాదిరి అయింది.
అంతటితో ఊరుకుందా ? ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్టు ఈ విషయాన్ని ఏకంగా తన భర్తకే చెప్పింది. భార్య చెప్పిన విషయం విని.. అతను షాకయ్యాడు. లూడో ఆటలో ఓడిపోయి తాను ఇంటి యజమాని సొంతమయ్యానని, మీరు ఇంటికొస్తే యజమాని తనను చంపేస్తాడని చెప్పేసరికి.. ఆ భర్త నివ్వెరపోయాడు. స్వగ్రామానికి వచ్చి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి, తన భార్యను కాపాడాలని వేడుకున్నాడు.