APRIL 11 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం నుంచి అనుకూలంగా ఉంటుంది. రెండ్రోజులుగా జరుగుతున్న..

Update: 2023-04-10 23:30 GMT

april 11 horoscope in telugu

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, మంగళవారం

తిథి : బ.పంచమి ఉ.7.18 వరకు, బ.అష్టమి బుధవారం తె.5.39 వరకు
నక్షత్రం : జ్యేష్ఠ మ.12.57 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ.8.26 నుండి 9.16 వరకు, రా.10.58 నుండి 11.45 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.10 నుండి 12.55 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం నుంచి అనుకూలంగా ఉంటుంది. చర్చల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తలనొప్పి, కండరాల నొప్పులు వంటివి బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు, మాటామంతీకి సంబంధించిన విషయాలు మధ్యాహ్నం లోగా పూర్తిచేసుకోవాలి. ఆలోచనలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన సర్దుబాట్లకు అనుకూలం. ఎదుటివారిని ఒప్పించే ప్రయత్నాలు కలసివస్తాయి. మొండిబాకీల వసూలుపై దృష్టి సారిస్తే ఫలితం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం నుంచి అనుకూలంగా ఉంటుంది. రెండ్రోజులుగా జరుగుతున్న తగాదాలు తగ్గుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వైద్య సంప్రదింపులు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజంతా సాధారణంగా ఉంటుంది. అందరు కావాలనుకునే మంచితనం తగదు. అప్పులివ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. అర్థం చేసుకునేవారి సంఖ్య తగ్గుతుంది. ఫైనాన్స్, సంతకానికి విలువైన ఉద్యోగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. రిజిస్ట్రేషన్లు, కొనుగోళ్లకు సంబంధించిన అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కవగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. వీలైనంత వరకూ వాహనాన్ని నడపకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బెటర్ జాబ్స్ ప్రయత్నాలకు అనుకూలమైన కాలం. ఆర్థికంగా ఊరటనిచ్చే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికమవుతాయి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రమ పెరుగుతుంది. మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. పార్ట్ టైమ్ ఉద్యోగ ప్రయత్నాలకు, దీర్ఘ కాలిక అనారోగ్యాలకు వైద్యం పొందేందుకు అనుకూలంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్లపై దృష్టిసారిస్తారు. నూతన ఆలోచనలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. ఎదుటివారితో మిమ్మల్ని పోల్చి చెప్పడాన్ని సహించలేరు. వినోద కార్యక్రమాలకు ఆకర్షితులవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.







Tags:    

Similar News