APRIL 15 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఉంటుంది. ఉన్నంతలో జాగ్రత్తగా..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శనివారం
తిథి : బ.దశమి రా.8.45 వరకు
నక్షత్రం : శ్రవణ ఉ.7.34 వరకు
వర్జ్యం : ఉ.11.17 నుండి 12.46 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.56 నుండి 7.35 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.40 నుండి 11.10 వరకు, సా.3.15 నుండి సా.3.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకోగలుగుతారు.ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తెలియని ధైర్యంతో ఉంటారు. వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. నష్టాలుండవు కానీ ఆశించిన మేర లాభాలు కూడా ఉండవు. అప్పులు ఇవ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండాలి. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. ఎవరూ ఊహించినంతమేర సహాయ సహాకారాలు ఇవ్వరు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అప్పులకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారస్తులు రోజు గడిపేశామా అన్నట్లు వ్యవహరించడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన విషయాలను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారస్తులకు కాలం కలసివస్తుంది. అదనపు ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రదేశాలు సందర్శిస్తారు. శుభవార్తలు వింటారు. మనసుకి ఉల్లాసాన్నిచ్చే వాతావరణం ఉంటుంది. శుభకార్యాలపై దృష్టిపెడతారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఉంటుంది. ఉన్నంతలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు అసౌకర్యాన్ని కలుగజేస్తాయి. ఎవరికీ తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు ఉండొచ్చు. ఎదుటివారితో మాట్లాడేటపుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు కలుగుతుంది. ఎదుటివారి నుంచి తెలుసుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదన్న ఆలోచనలు బలపడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు, రుణ ప్రయత్నాలకు, రుణాలను వసూలు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. మాట పడరు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు. ఈ రోజు ధరించకూడని రంగులు లేత రంగులు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోజు అంచనాల మేరకు గడవదు. అయినవారే అర్థం చేసుకోవడం లేదన్న ఆలోచనలు బలపడతాయి. అలసట పెరుగుతుంది.ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్న చిన్న అవకాశాలను వినియోగించుకుంటారు. ఎదుటివారితో, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మంచిరోజు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వీలైనంత వరకూ తగ్గి ఉండటం మంచిది. కొత్త వస్తువులను కొనకపోవడం, కొత్త అప్పులు చేయకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి పరంగా మంచి స్థితిగతులను కలిగి ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.