APRIL 17 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగపరంగా ఊరటనిచ్చే పరిణామాలు..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, సోమవారం
తిథి : బ.ద్వాదశి మ.3.46 వరకు
నక్షత్రం : పూర్వాభాద్ర రా.2.26 వరకు
వర్జ్యం : ఉ.10.03 నుండి 11.33 వరకు
దుర్ముహూర్తం : మ.12.31 నుండి 1.21వరకు, మ.3.00 నుండి 3.50 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.5.10 నుండి 5.55 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. వ్యాపారస్తులకు మేలు జరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ పై దృష్టి సారిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అర్థంలేని వివాదాలకు దూరంగా ఉంటారు. అన్నదమ్ములతో ఏర్పడే తగాదాలకు దూరంగా ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. బంధువులను దూరంగా ఉంచుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి నిద్రాహారాలను కలిగి ఉంటారు. ప్రతిదానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. రహస్య శత్రువులను కనిపెడతారు. ఉద్యోగంలో ఊరటనిచ్చే పరిణామాలు చోటుచేసుకుంటాయి. దంపతుల మధ్య తగాదాలు తగ్గుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరక అలసట పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. జీవిత భాగస్వామి అర్థంచేసుకోవడం లేదన్న ఆలోచనలు బలపడతాయి. ప్రతి విషయంలో నెగిటివ్ ఫీలింగ్స్ పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అర్థం చేసుకునేవారు అందుబాటులో ఉంటారు. మంచి సహాయ, సహకారాలు అందుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన వస్త్రాభరణాలు, కొనుగోళ్లు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగపరంగా ఊరటనిచ్చే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పది మందీ మెచ్చుకునేలా ప్రవర్తిస్తారు. పాతపరిచయాలు బలపడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. తగాదా లేకుండా రోజు గడవడం కష్టం. ఉద్యోగ పరంగా తెలియని ఆందోళన ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు. మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదని భావిస్తార. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు చోటుచేసుకుంటాయి. బద్ధకం పెరుగుతుంది. పనులు వాయిదా పడుతుంటాయి. రిజిస్ట్రేషన్ల కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. సులభతరమైన పనులను మాత్రమే చేయడం మంచిది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా, ఉద్యోగ ప్రయత్నాలకు, చదువును పునః ప్రారంభించడం వంటి వాటికి మంచి కాలం. ప్రతి విషయంలో అనుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. వెలుగు, నీడల దోబూచులాటగా ఉంటుంది. వచ్చిన రూపాయి వచ్చినట్టు ఖర్చైపోతుంది. లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగులు లేత రంగులు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆలోచనలకు అధిక ప్రాముఖ్యతనిస్తారు. తొందరపాటుతనానికి దూరంగా ఉంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పాత స్నేహాలు బలపడతాయి. బంధువులతో గొడవలు జరగవచ్చు. కాంట్రాక్ట్ రంగంవారికి మంచి కాలం. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అంత అనుకూలం కాదు. సునాయాసంగా జరిగే పనులపై మాత్రమే దృష్టిసారించడం మంచిది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.