APRIL 19 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా..

Update: 2023-04-18 23:30 GMT

telugupost horoscope

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బుధవారం

తిథి : బ.చతుర్దశి ఉ.11.24 వరకు
నక్షత్రం : రేవతి రా.11.52 వరకు
వర్జ్యం : మ.12.26 నుండి 1.57 వరకు
దుర్ముహూర్తం : మ.11.41 నుండి 12.31 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.10 నుండి 10.10 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి. కష్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. శత్రుబలం పెరుగుతుంది. దృష్టిదోషం అధికమవుతుంది. ఎదుటివారు అపార్థాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నింటా అనుకూలంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అన్నింటా అనుకున్న విజయాన్ని అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల వాతావరణం ఉంటుంది. అర్థవంతమైన ఖర్చులుంటాయి. కావాలనుకున్న రూపాయిని సంపాదించుకుంటారు. ఆరోగ్యం మినహా అన్నీ సానుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా కలసివస్తుంది. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. పార్ట్ టైమ్ జాబ్స్ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పరిచయాలు ఉపయోగపడతాయి. కొత్తవిషయాలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీడెంచి మేలెంచాలన్న విధంగా ఆలోచించాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఎదుటివారిని అపార్థం చేసుకుంటారు. పనిఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభకార్యాల్లో సక్సెస్ అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కొనుగోళ్లు అంశాలు కలసివస్తాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. గౌరవం పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెండింగ్ పనులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఎదుటివారికి మంచి చెప్పి మీరు చెడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొనుగోళ్లు, అమ్మకాల్లో వాయిదా ధోరణిలో ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రిస్క్ కు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రతి విషయంలో మీరే తగ్గి ఉండక తప్పని పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు స్వయంకృతాపరాధం లేనంతవరకూ ప్రతివిషయంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. వాహనయోగం ఉంది. స్నేహాలు బలపడతాయి. మర్యాద పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపకరిస్తాయి. ఇచ్చిన మాట తప్పరు. వాహన మరమ్మతులు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు అనుకూలం. శారీరక అలసట పెరుగుతుంది. పాత విషయాలు పదే పదే జ్ఞాపకానికి వస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాల్లో పాలుపంచుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటారు. నూతన అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.









Tags:    

Similar News