APRIL 20 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి.

Update: 2023-04-19 23:30 GMT

telugupost horoscope

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, గురువారం

తిథి : చైత్ర అమావాస్య ఉ.9.42 వరకు
నక్షత్రం : అశ్విని రా.11.09 వరకు
వర్జ్యం : రా.7.16 నుండి 8.49 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.01 నుండి 10.51 వరకు, మ.3.00 నుండి 3.50 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.4.30 నుండి 5.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఒత్తిడి అధికంగా ఉన్నా పనుల్లో పనుల్లో విజయం ఉంటుంది. ఉద్యోగస్తులు మెరుగైన ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఊహించని ఖర్చులుంటాయి. అనవసరమైన విషయాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నింటా పైచేయిగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. తగాదాలు, వివాదాలతో కూడిన అంశాలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. అప్పులు తీర్చేందుకు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారికి మాటసహాయం చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విచిత్రంగా ఉంటుంది. క్షణం తీరిక ఉండదు. పైసా ఆదాయం ఉండదు. కానీ క్షణం తీరిక లేకుండా గడుపుతారు. మీరు ఎదుటివారికి ఉపయోగపడుతున్నారో ఎదుటివారు మీకు ఉపయోగపడుతున్నారో కూడా తెలియని అయోమయంలో ఉంటారు. మంచి ఆహారాన్ని తీసుకుంటారు. ఆగిపోయిన పనుల్లో కదలికలు వస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. మంచి సంఘ గౌరవాన్ని కలిగిఉంటారు. పేరు, ప్రఖ్యాతులతో పాటు ఆదాయన వనరుల సమకూర్పు కలసివస్తాయి. కాంట్రాక్ట్ రంగంవారికి యోగదాయకంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాలకు దూరంగా ఉండాలి. కీలకమైన అంశాలను వాయిదా వేయడం మంచిది. రిస్క్ కి దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. ఒకే సమయంలో అనేక పనులను సానుకూల పరిచే ప్రయత్నాలు కలసివస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి, నిదానంగా ముందుకు వెళ్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. నూతన ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అవునన్నా కాదన్నా తగాదాగానే ఉంటుంది. వీలైనంత తక్కువగా మాట్లాడటం మంచిది. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరేమన్నా పట్టించుకోకపోవడం మంచిది. అనవసరమైన ప్రయాణాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. అనవసరమైన విషయాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. వృధా ఖర్చులుంటాయి. మిమ్మల్ని ఎవరూ అర్థంచేసుకోవట్లేదన్న భావజాలం పెరుగుతుంది. రాజకీయ, కళా సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఈ పని ఎందుకు పూర్తికాదన్న పంతంతో ఉంటారు. ఇచ్చిన అప్పులు వసూలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు లేవు. అలాగే ఇతరత్రా ఇబ్బందులు కూడా పెద్దగా లేవు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒకేసమయంలో అనేక పనులు సానుకూల పరచుకోవాల్సిన కారణంతో అలసిపోతారు. వ్యాపారస్తులకు అనుకూలం. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. వాహన మరమ్మతులు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.








Tags:    

Similar News