APRIL 24 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు యోగదాయకంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటర్వ్యూలు ..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, సోమవారం
తిథి : శు.చవితి ఉ.8.25 వరకు
నక్షత్రం : మృగశిర రా.2.06 వరకు
వర్జ్యం : ఉ.6.25 నుండి 8.08 వరకు
దుర్ముహూర్తం : మ.12.30 నుండి 1.20 వరకు, మ.3.00 నుండి 3.50 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.5.10 నుండి 5.57 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇష్టమైనవారితో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శుభకార్యాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు సాధారణ ఫలితాలుంటాయి. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్లానింగ్స్ తారుమారవుతాయి. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ఊహించని ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతత లభిస్తుంది. ప్రతి విషయంలో నిదానంగా ఆలోచిస్తారు. కోపాన్ని, ఆవేశాన్నికంట్రోల్ చేసుకుంటారు. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగస్తులకు మంచికాలం. దంపతుల మధ్య తగాదాలు సహజం. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటపుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. తక్కువగా మాట్లాడాలి. రహస్య శత్రువులతో ఇబ్బంది పడతారు. దృష్టిదోషం పెరుగుతుంది. ఇతర ఆదాయ వనరుల కోసం ప్రయత్నాలు అంతంతమాత్రంగా ఫలిస్తాయి. ఊహించని ప్రయాణాలు ఎదురవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. పేరు, ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. ఉపయోగకరమైన పరిచయాలుంటాయి. పాతపరిచయాలను బలపరుచుకుంటారు. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. ఒత్తిడులను అధిగమిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు యోగదాయకంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. దేనినీ పట్టించుకోరు. ప్రతిదానిని వెనుక ఉండి నడిపిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలం. సౌకర్యాలను సమకూర్చుకుంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 తర్వాత అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం వరకూ రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అంచనాలు తారుమారవుతాయి.ఆర్థిక స్థితిగతులు ఇబ్బందిపెడతాయి. ఎదుటివారు మీపై నిందలు వేస్తారు. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ముఖ్యమైన పనులు, చర్చలు, ఆర్థిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు మధ్యాహ్నంలోపు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఖర్చులు శృతి మించుతాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనుకూలమైనకాలం. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సాహసోపేతంగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలపై దృష్టిసారిస్తారు. ప్రతి విషయంలో తెగింపుని కనబరుస్తారు. అన్నింటా విజయాల్ని సొంతం చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి చిన్న విషయానికి తగాదా పడతారు. ఆర్థికపరమైన విషయాలపై నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడతాయి. పదేపదే తగాదాలు చోటుచేసుకుంటాయి. మీ తప్పు లేకపోయినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధ్యతలు బరువుగా పరిణమిస్తాయి. వృథాఖర్చులు, అనవసరమైన ఖర్చులు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.బద్ధకం పెరుగుతుంది. అనుకున్నంత వేగంగా పనులు పూర్తవ్వక నిరుత్సాహ పడతారు. నిదానంగా వ్యవహరించాలి. కొత్తపరిచయాలకన్నా పాతపరిచయాల వల్ల మేలు కలుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.