APRIL 29 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మెరుగైన ఫలితాలుంటాయి. మధ్యాహ్నం 1 గంట వరకూ అనుకూలంగా ఉంటుంది.

Update: 2023-04-28 23:30 GMT

april 29th horoscope in telugu

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శనివారం

తిథి : శు.నవమి సా.6.22 వరకు
నక్షత్రం : ఆశ్లేష మ.12.45 వరకు
వర్జ్యం : రా.2.37 నుండి 3.54 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.47 నుండి 7.27 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.50 నుండి 11.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వివాదాస్పదమైన అంశాల జోలికి పోకూడదు. రూమర్స్ ప్రచారంలో ఉంటాయి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. పనులు వాయిదా పడుతాయి. ప్రయాణాల వల్ల కూడా మేలు జరగదు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12.30 తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు, క్రయవిక్రయాల అంశాలు మధ్యాహ్నం తర్వాత చూసుకోవడం మంచిది. ఆశించిన మేర పెట్టుబడులు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన వివాదాలు చోటుచేసుకుంటాయి. అలసట పెరుగుతుంది. మీ గురించి తెలుసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఎదుటివారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి యోగదాయకంగా ఉంటుంది. మధ్యాహ్నం వరకూ ప్రయాణాలు, ఖర్చులు నష్టం కలిగిస్తాయి. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు సాధారణంగా కొనసాగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మెరుగైన ఫలితాలుంటాయి. మధ్యాహ్నం 1 గంట వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులుండవు. క్రయవిక్రయాలు మధ్యాహ్నం లోగా పూర్తిచేసుకోవాలి ఈ రోజు ధరించకూడని రంగు బూడిదరంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, రిజిస్ట్రేషన్లు, శుభకార్యాలు, వ్యవహారాలు, చర్చలకు, ఎదుటివారిని కలిసేందుకు ఇబ్బందులు ఉండవు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. కెరియర్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుటివారిపై ఒక అంచనాకు వస్తారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ వ్యతిరేకంగా ఉంటుంది. ఆ తర్వాత అనుకూలంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్లు, శుభకార్యాల ప్రయత్నాలు కలసివస్తాయి. అయినవారెవరో, కాని వారెవరో తెలుసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాతి నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆర్థిక, ఉద్యోగం, దంపతుల మధ్య విషయాలపై మధ్యాహ్నం లోపు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. రిటైర్ అయినవారికి కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకూ తగాదాలు, నిరుత్సాహం, వృథాఖర్చులు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాతి నుంచి ఇవన్నీ మారుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.




Tags:    

Similar News