APRIL 7 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. లోపల భయం ఉన్నా.. మేకపోతు గాంభీర్యం అన్నట్టుగా..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బుధవారం
తిథి : బ.పాడ్యమి ఉ.10.21వరకు
నక్షత్రం : చిత్త మ.1.31 వరకు
వర్జ్యం : రా. 7.14 నుండి 8.51 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.28 నుండి 9.17 వరకు, మ.12.33 నుండి 1.25 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.2.10 నుండి 2.50 వరకు, సా.5.15 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారికి ఇచ్చిన అప్పుల వసూళ్లకు, ప్రేమలకు, ఇంట్లో తగాదాల పరిష్కారానికి మంచికాలంగా ఉంటుంది. అప్పులు తీర్చే ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ముల మధ్య ఉన్న తగాదాలు కూడా పరిష్కారమవుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గడిచిన రెండ్రోజులకంటే బాగుంటుంది. చాలా తక్కువగా మాట్లాడుతారు. తగాదాలకు దూరంగా ఉంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉపయుక్తమైన ఖర్చులుంటాయి. సంతకానికి విలువ పెరుగుతుంది. పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన తగాదాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఎవరు చిన్నమాట అన్నా మనసుకు తీసుకుని బాధపడతారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ప్రతికూలమైన వాతావరణంలో అనుకూల ఫలితాల కోసం ప్రయత్నం చేస్తారు. నమ్మకద్రోహం కలిగేందుకు అవకాశాలు ఎక్కువ. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గడిచిపోయిన సంఘటనలు పదేపదే గుర్తుకొస్తుంటాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గౌరవ, మర్యాదలు లభిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. మాటతీరు బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన కాలం. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్ఫర్థలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన మాట పట్టింపులకు ప్రాముఖ్యతనిస్తారు. రోజంతా ప్లాన్ ప్రకారంగా గడుస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో లాభనష్టాలు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. లోపల భయం ఉన్నా.. మేకపోతు గాంభీర్యం అన్నట్టుగా వ్యవహరిస్తారు. అనవసరమైన విషయాలను పట్టించుకోరు. కీలక విషయాలపై దృష్టిసారించి సర్దుబాట్లు చేసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అందానికి ప్రాముఖ్యత ఇస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. గడిచిన రెండ్రోజులకంటే ఏ వయసులో ఉన్నవారికైనా రిస్క్ మంచిది కాదు. ఎలా జరిగేదాన్ని అలా జరగనివ్వడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. హాబీస్ పై దృష్టిసారిస్తారు. పరిచయాలు పెంచుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత తగ్గుతుంది. వ్యాపారస్తులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలపై దృష్టిసారించేందుకు, బెటర్ జాబ్స్ ప్రయత్నాలు, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తప్పులు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. నలుగురితో కలసి మెలసి ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజుఅనుకూలంగా ఉంటుంది. రోజంతా అంచనాల మేరకు గడుస్తుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అప్పులు చేసే పరిస్థితులు ఏర్పడుతాయి. మొండితనమే శ్రీరామరక్షగా ఉంటుంది. ఏ పని చేపట్టినా ఎంతోకొంత లాభం పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ప్రతి విషయాన్ని అనుమానంతో చూస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.