DECEMBER 16 : నేటి పంచాగం, దినఫలాలు , ఈ రాశుల వారికి మధ్యాహ్నం నుండి అన్నీ కలిసివస్తాయ్

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు.;

Update: 2022-12-15 23:30 GMT

Daily horoscope in telugu

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, శుక్రవారం

తిథి : బ.అష్టమి తె.3.02 వరకు
నక్షత్రం : పూర్వ ఫల్గుణి ఉ.7.35 వరకు
వర్జ్యం : మ.3.18 నుండి 5.01 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.45 నుండి 9.29 వరకు, మ.12.25 నుండి 1.09 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.00 నుండి 8.35 వరకు, సా.5.45 నుండి 6.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు, మనస్పర్థలు ఏర్పడుతాయి. ఆర్థిక చికాకులుంటాయి. సాయంత్రానికి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులివ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతన పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కర్కాటక రాశి

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం నుండి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. రహస్యాలను ఇతరులతో చెప్పకపోవడం మంచిది. శత్రుబలం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్తపరిచయాలు ఏర్పడుతాయి. ఆగిన పనుల్లో కదలికలు ఏర్పడుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఉపయుక్తమైన పరిచయాలు, ఉపయుక్తమైన ఖర్చులు ఉంటాయి. నిర్ణయాలు కలసివస్తాయి. బ్యాంకు రుణాలు అందుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలపై దృష్టిసారిస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రుబలం పెరుగుతుంది. రూమర్స్ ప్రచారంలో ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ప్రశాంతత, ఊరట లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకూలం. చర్చలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.



Tags:    

Similar News