DECEMBER 24 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. పాత పరిచయాలు..;
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, శనివారం
తిథి : శు.పాడ్యమి మ.12.06 వరకు
నక్షత్రం : పూర్వాషాఢ రా.10.15 వరకు
వర్జ్యం : ఉ.9.38 నుండి 11.02 వరకు, తె.5.17 నుండి ఉ.6.42 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.36 నుండి 8.05 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : సా.6.30 నుండి 7.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలమైన కాలం. స్వయంకృతాపరాధం మినహా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం విషయంలో మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రతి విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు రొటేషన్లలో ఇబ్బందులుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఉద్యోగ, వ్యాపార, చర్చలు, ఆర్థిక, ఆరోగ్యం పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఆలోచనలు చేస్తారు. పాత పరిచయాలు సహకరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అనుకూలం. మానసిక ప్రశాంతత, తృప్తి ఏర్పడుతాయి. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కుటుంబ సభ్యులతో తగాదాలు రావొచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకూలం. అలసట ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒకడుగు ముందుకేస్తే.. రెండు అడుగులు వెనక్కి వేస్తారు. ఏ పని పూర్తవుతుంది ? ఏ పని పూర్తి కాదు.. తెలుస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. పాత పరిచయాలు ఉపకరిస్తాయి. నేర్పుగా వ్యవహరిస్తారు. ఉద్యోగ, వ్యాపారస్తులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో మాట పట్టింపులు చోటుచేసుకుంటాయి. అధికారుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. అంచనాలు తారుమారవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. లాభాలను సొంతం చేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకూలం. కొత్త పెట్టుబడులు, ఆర్థిక వెసులుబాటులోనూ విజయాలు సొంతం చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ రాశిలో ఉన్న పిల్లల విషయంలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ, వ్యాపారస్తులకు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికపరంగా చేసే చర్చలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. విహార, వినోద కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొనుగోళ్లు, అమ్మకాలు కలసివస్తాయి. పాత, కొత్త పరిచయాలు ఉపయోగకరంగా ఉంటాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత, తృప్తి ఏర్పడుతాయి. కుటుంబ సభ్యుల సహాయ, సహకాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.