DECEMBER 28 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పని ఒత్తిడితో కూడుకుని, చివరికి పూర్తవుతాయి. ఎదుటివారికి సహాయం చేయడమే..;
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, బుధవారం
తిథి : శు.షష్ఠి రా.8.44 వరకు
నక్షత్రం : శతభిషం మ.12.46 వరకు
వర్జ్యం : సా.6.53 నుండి 8.25 వరకు
దుర్ముహూర్తం : మ.11.47 నుండి 12.31 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.30 నుండి 10.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్ని విధాలా కలసివస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారస్తులకు రొటేషన్లు సానుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి ఉద్యోగాల పరంగా కొత్త విషయాలను తెలుసుకునే అవకాశాలొస్తాయి. స్కిల్స్ ను పెంచుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. ఎదుటివారికిచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. ఆర్థికంగా నిరుత్సాహంగా ఉంటారు. తేలికపాటి పనులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఒకే సమయంలో అనేక పనులు చేయాల్సి ఉండటంతో.. ఇబ్బంది పడుతారు. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేసుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే విషయమై జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తల మధ్య తగాదాలు ఏర్పడవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలం. పొదుపుపై దృష్టి సారిస్తారు. బంధుత్వాలు, బాంధవ్యాలు ఆనందాన్నిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ట్రాన్స్ఫర్ల విషయంలో కంగారు పడతారు. దూరప్రాంత ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులు పెరుగుతారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పని ఒత్తిడితో కూడుకుని, చివరికి పూర్తవుతాయి. ఎదుటివారికి సహాయం చేయడమే తప్ప మీకు సహకరించే వర్గం చేరువలో ఉండదు. శారీరక, మానసిక అలసట పెరుగుతుంది. విద్యార్థినీ విద్యార్థులు శ్రద్ధను కనబరచాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తమకు తాముగా కొన్నిపనులకు దూరంగా ఉంటారు. ఎదుటివారు మోసం చేసే అవకాశాలెక్కువ. వృత్తి, ఉద్యోగాల పరంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా సాగుతున్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. రుణప్రయత్నాలు కలసివస్తాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్లో పనిచేసేవారికి అనుకూలమైన కాలం. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడులు పెరుగుతాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ. ఫలితం తక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్థలానికి సంబంధించిన క్రయవిక్రయాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుబలం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మాట పట్టింపులు చోటుచేసుకుంటాయి. దృష్టిదోషం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.