DECEMBER 31 : ఈ ఏడాదిలో ఆఖరి రోజు.. ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉందంటే..
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. అనుకున్నదొకటి జరిగేది మరొకటిగా ఉంటుంది. ఆర్థికంగా..;
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, శనివారం
తిథి : శు.నవమి సా.6.33 వరకు
నక్షత్రం : రేవతి మ.11.47 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ.6.39 నుండి 8.08 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : మ.3.55 నుండి 4.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుండి అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉత్సాహాన్ని కలిగి ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఖర్చు మీది.. ఆనందం ఎదుటివారిది అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఇతరుల నుండి సహాయ, సహకారాలు అందివస్తాయి. కాంట్రాక్ట్ రంగాలవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత నుండి భవిష్యత్ పై సీరియస్ గా దృష్టిసారిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రతి విషయంలో విభేదాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. అనుకున్నదొకటి జరిగేది మరొకటిగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. సంతకానికి విలువైన ఉద్యోగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలను నడపకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో ఒకటికి రెండు ప్లాన్ లు పెట్టుకోవడం మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థినీ, విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. వాహనాల కొనుగోళ్లలో ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతిదానిలో మీదే పై చేయిగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. అన్నిరంగాల వారికి సానుకూలమైన వాతావరణం ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చాలా వరకూ అనుకూలమైన వెసులుబాటు లభిస్తుంది. నిందలు తొలగిపోతాయి. శత్రుబలం తగ్గుతుంది. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పు ఇవ్వడం, తీసుకోవడానికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్త అవసరం. విద్యార్థినీ విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తిచేసుకోవడం మంచిది. అన్నీ బాగుంటాయి కానీ.. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుండి కాలం సహకరిస్తుంది. ఏ పనిచేసినా సహకరించేవారు చేరువలో ఉంటారు. అప్పులను చేసి పెట్టుబుడలు పెట్టే యోచన చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుండి ఖర్చులు పెరుగుతాయి. వినోద కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. ఇంట, బయట మాటకు విలువ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.