DECEMBER 7 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకున్నదొకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, బుధవారం
తిథి : శు. చతుర్ధశి ఉ.8.21 వరకు
నక్షత్రం : కృతిక ఉ.10.25 వరకు
వర్జ్యం : రా.3.50 నుండి 5.35 వరకు
దుర్ముహూర్తం : మ.11.37 నుండి 12.21 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.40 నుండి 10.30 వరకు, మ.1.45 నుండి 2.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. రహస్యాలను ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది. అపార్థాలు చోటుచేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా అనవసర వివాదాలు తలెత్తవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. రాజకీయ రంగంలో ఉండేవారు తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. కాంట్రాక్ట్ రంగంలో వారికి కాలం కలిసివస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఊహించని ప్రయాణాలు చేస్తారు. గాయాలు కావొచ్చు. ఎదుటివారిని అంచనా వేయడంలో విఫలమవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అప్పులు తీర్చే ప్రయత్నాలు కలసివస్తాయి. చర్చలు ఫలిస్తాయి. శుభకార్యాలపై దృష్టిసారిస్తారు. పరిచయాలు ఉపకరిస్తాయి. ప్రయాణాలు సానుకూలమవుతాయి. ఆధ్యాత్మికతతో ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకుంటారు. పెద్దల సూచనలతో లాభాలు పొందుతారు. వ్యాపారులు, రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతిపనిలో విభేదించే వారి సంఖ్య పెరుగుతుంది. తప్పనిసరి పనులు మినహా మిగతా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకున్నదొకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేసే అవకాశాలుంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. దృష్టిదోషం పెరుగుతుంది. నిదానమే ప్రధానంగా ముందుకు సాగాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. కొత్తఆలోచనలతో సరికొత్తగా ముందుకెళ్తారు. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికపరమైన చర్చలు కలిసివస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. బ్యాంక్ లోన్లు అందుతాయి. గొంతు సంబంధిత సమస్యలు బాధిస్తాయి. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి పనీ కష్టం, తగాదాలు, వివాదాలకు కూడుకుని ఉంటుంది. చేయని తప్పులకు బాధ్యత వహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. కీలకమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు స్వయంగా పనులను వాయిదా వేసుకుంటారు. కీడెంచి మేలెంచాలన్న విధంగా ఆలోచిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహన మరమ్మతులు తప్పకపోవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. బెటర్ మెంట్ కోసం ప్రయత్నిస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు లేత బ్రౌన్ కలర్.