FEBRUARY 27 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మనసులో మాటను ఎదుటివారితో..;
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, సోమవారం
తిథి : శు.అష్టమి తె.2.21 వరకు
నక్షత్రం : రోహిణి (పూర్తిగా)
వర్జ్యం : రా.10.39 నుండి 12.23 వరకు
దుర్ముహూర్తం : మ.12.44 నుండి 1.30 వరకు, మ.3.04 నుండి 3.50 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.10 నుండి 9.40 వరకు, సా.4.00 నుంచి 4.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. సంఘ గౌరవం పెరుగుతుంది. మర్యాదలు పెరుగుతాయి. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత పరిచయాలు ఉపకరిస్తాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. దృష్టిదోషం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కీడెంచి మేలెంచాలన్న చందంగా ఆలోచిస్తారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఉత్సాహంగా ఉంటారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. శత్రుబలం తగ్గుతుంది. వాహనయోగం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒకమాట మాట్లాడితే పెడార్థాలు తీస్తారు. నిద్రాహాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశాలు ఏర్పడుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా ఉంటాయి. నూతన విషయాలపై ఆసక్తిని కనబరుస్తారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. క్రయవిక్రయాలపై దృష్టి సారిస్తారు. శత్రువులెవరో, మిత్రులెవరో తెలుసుకుంటారు. కోర్టు కేసుల్లో కీలక పరిణామాలుంటాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి. శత్రువులు పక్కనే ఉంటారు. ఆర్థికపరంగా సేవింగ్స్ సాధ్యపడవు. అంచనాలు తారుమారవుతాయి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రిస్క్ కు ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. ఏ విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. రోజంతా చికాకుగా గడుస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మనసులో మాటను ఎదుటివారితో పంచుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక సర్దుబాట్లలో నేర్పుగా వ్యవహరిస్తారు. వివాహాది శుభకార్యాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. విద్యార్థినీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీ తప్పు లేకపోయినా మాటపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండటం మేలు. ఇంట్లోని వస్తువులను తాకట్టు పెట్టకపోవడం ఉత్తమం. ఆర్థిక ఇబ్బందులు, అవసరాల చుట్టూనే రోజంతా కొనసాగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలమైన ఫలితాలుంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. క్రయవిక్రయాలు కలసివస్తాయి. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. కెరియర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మధ్యాహ్నం తర్వాత శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.