JANUARY 11 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు శుభపరిణామం.;
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, బుధవారం
తిథి : బ.చవితి మ.2.31 వరకు
నక్షత్రం : మఖ మ.11.50 వరకు
వర్జ్యం : ఉ.8.42 నుండి 10.28 వరకు
దుర్ముహూర్తం : మ.11.53 నుండి 12.37 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 5.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చర్చలు ఫలిస్తాయి. నిదానమే ప్రధానమన్న విధంగా వ్యవహరించాలి. రిజిస్ట్రేషన్లు వాయిదా పడొచ్చు. ఇంట్లో వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదన్న మానసిక వేదన పెరుగుతుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడతాయి. ఎదుటివారి నుండి ఊహించిన రీతిలో సహాయం అందకపోవడంతో నిరాశ చెందుతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. కాంట్రాక్ట్ రంగంలోవారు జాగ్రత్తగా ఉండాలి. ఊహాగానాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. చర్చలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. ప్రయాణాలపట్ల ఆసక్తికరంగా ఉంటాయి. ఇష్టమైన ఆహారాన్ని తీసుకోగలుగుతారు. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు అన్నిరకాలుగా మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు నూతన అవకాశాలు కలసివస్తాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడేటపుడు ఆచితూచి వ్యవహరించాలి. అనుకూలమైన వర్గం తక్కువగా ఉంటుంది. మానసిక, శారీరక అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెండింగ్ పనుల్లో కదలికలు ఏర్పడుతాయి. రహస్య శత్రువులను అదుపులో ఉంచుతారు. దృష్టిదోషం పెరుగుతుంది. అధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ.. ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎవరేం చెప్పినా.. వినీ విననట్టుగా ఉండటం మంచిది. అన్నింటికీ సమాధానం చెప్పడం వల్ల సమస్యలు ఏర్పడుతాయి. కొత్తపరిచయాలు ఏర్పడుతాయి. పాతపరిచయాలు ఉపకరిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద(Yash) రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు శుభపరిణామం. బ్యాంక్ రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. స్థిరచరాస్తుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చర్చలు కలసివస్తాయి. దంపతుల మధ్య తగాదాలు పరిష్కారమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగాలపై దృష్టిని సారిస్తారు. కాంట్రాక్ట్ రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు రొటేషన్లు సానుకూలంగా సాగుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడతాయి. వ్యాపారస్తులకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ నమ్మకూడదు. ఆర్థికపరంగా తగిన జాగ్రత్త తీసుకోవాలి. అధికారులతో కాస్త సున్నితంగా వ్యవహరించడం మంచిది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. పనివేళలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా కలసివస్తుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఆర్థికపరంగా మెరుగ్గా ఉంటుంది. నూతన పెట్టుబడుల ప్రయత్నాలు కలసివస్తాయి. ప్రయాణాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యానికి మంచివైద్యం లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.