JANUARY 17 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రమ ఎక్కువ, ఫలితాలు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, మంగళవారం
తిథి : బ.దశమి సా.6.05 వరకు
నక్షత్రం : విశాఖ సా.6.46 వరకు
వర్జ్యం : రా.10.32 నుండి 12.03 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.57 నుండి 9.41 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.1.00 నుండి 1.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన పరిచయాలు ఏర్పడుతాయి. బాధ్యతలు నిర్వహించుకునేందుకు కొత్త అవకాశాలు కలిసివస్తాయి. శుభకార్యాల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గిట్టనివారిని దూరం పెట్టడంతో.. మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. క్రయవిక్రయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. విహారయాత్రలు, ప్రయాణాల్లో అసౌకర్యం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన అవకాశాలు కలసివస్తాయి. కళా, సాహిత్య రంగాల వారికి అనుకూలం. ట్యూషన్లను ప్రారంభించేందుకు మంచి అవకాశం. ఆగిపోయిన పనులు ముందుకి సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రమ ఎక్కువ, ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఒత్తిడి పెరుగుతుంది. గొంతు సంబంధిత సమస్యలు బాధిస్తాయి. తండ్రితో లేదా తండ్రి తరపు బంధువులతో వాగ్వాదం జరగవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. చర్చలు ఫలిస్తాయి. అప్పులను వసూలు చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. పొదుపు చేయడం సాధ్యమవదు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. శత్రుబలం పెరుగుతుంది. దృష్టిదోషం ఎక్కువవుతుంది. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. సంఘగౌరవం ఏర్పడుతుంది. గడిచిన కాలాన్ని గుర్తుచేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విచిత్రంగా సాగుతాయి. పనుల విషయంలో అంచనాలు తారుమారవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు భారమవుతాయి. పనిఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. జలుబు వంటివి బాధిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు శ్రద్ధగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూలతలు పెరుగుతాయి. అన్ని రకాలుగా ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ఫైనాన్స్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. అసంతృప్తి ఉంటుంది. బాధ్యతలు నెరవేరుస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. తప్పనిసరి పనులు మినహా.. కీలక నిర్ణయాలు, పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట్లో ఉన్న వారితో మనస్పర్థలు ఏర్పడుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడతాయి. ముభావంగా ఉంటారు. ఏ పనిపైనా ఆసక్తి ఉండదు. ఉద్యోగ, వ్యాపారాల్లో వారికి సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.