JANUARY 21 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు నిదానమే ప్రధానంగా వ్యవహరించాలి. అన్ని వృత్తుల వారు అన్నివిధాలా చాలా జాగ్రత్తగా
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్య మాసం, శుక్రవారం
తిథి : పుష్య అమావాస్య ఆదివారం తె.2.22 వరకు
నక్షత్రం : పూర్వాషాఢ ఉ.9.40 వరకు
వర్జ్యం : సా.4.37నుండి 6.00 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.43 నుండి 8.13 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో కీడెంచి మేలు ఎంచాలన్న విధంగా వ్యవహరించడం మంచిది. సంతకానికి విలువ ఉన్న ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. శత్రువులపై పై చేయి సాధించే ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలమైన ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి. కోర్టు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేవారికి కలసివస్తుంది. చర్చలు ఫలిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చిన్న గాయాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులెక్కువగా ఉంటాయి. ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఎదుటివారి మాట మీద బాధ్యత వహించాల్సిన అవసరాలు ఏర్పడుతాయి. మార్కెటింగ్ రంగాలవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ, ఫైనాన్స్ రంగాల్లోని ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలమైన ఫలితాలుంటాయి. సాహసోపేత పనులను చేస్తారు. అప్పులను వసూలు చేసుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మంచి వైద్యం లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా కలిసివస్తుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. భార్యభర్తల మధ్య తగాదాలు తొలగిపోతాయి. ఉన్నతాధికారుల నుండి వచ్చే ఒత్తిడులు తగ్గుతాయి. మనసుకు నచ్చినవారితో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఎంత మంచితనంగా మాట్లాడిన అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణ ప్రయత్నాలు చేస్తారు. పదునైన వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు నిదానమే ప్రధానంగా వ్యవహరించాలి. అన్ని వృత్తుల వారు అన్నివిధాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి ప్రయాణాలపై మాత్రమే దృష్టిసారించాలి. కీలక విషయాలపై పెద్దల సలహాలను తీసుకుని నడుచుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ధైర్యే సాహసే లచ్మి అన్నట్టుగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎవరేం మాట్లాడినా అపార్థాలు చోటుచేసుకుంటాయి. కోర్టు కేసులు, తగాదాలు అనుకూలిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. మూడ్రోజులుగా ఉన్న నిరుత్సాహం తొలగిపోతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. కాంట్రాక్ట్ రంగాలవారికి, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. నిరుత్సాహం, కోపం పెరుగుతాయి. ఎక్కువసేపు ఎదురుచూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడానికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. చర్చలు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. రిజిస్ట్రేషన్లు ముందజలో ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.