JULY 7 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయం చికాకుతో ఉంటుంది. కోపం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో..;

Update: 2023-07-06 23:30 GMT

july 7th horoscope in telugu, daily horoscope

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్రవారం

తిథి : బ.పంచమి రా.12.20 వరకు
నక్షత్రం : శతభిషం రా.10.18 వరకు
వర్జ్యం : ఉ.7.00 నుండి 8.27 వరకు, తె.4.16 నుండి 5.45 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.27 నుండి 9.19 వరకు, మ.12.47 నుండి 1.39 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.2.00 నుండి 2.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మానసిక అలజడి ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులుండవు. సామాజిక సేవల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్తవిషయాలు తెలుసుకుంటారు. ఫైనాన్స్, స్టేషనరీ రంగాల్లో వారికి అనుకూలం. విద్యార్థులకు అనుకూలం. లోన్ల విషయంలో గట్టిగా ప్రయత్నిస్తే ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అవమానం, గౌరవం రెండూ ఉంటాయి. తొందరపాటు తనానికి దూరంగా ఉండాలి. ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. శరీరం అలసిపోతుంది. మరమ్మతు పనులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచికిపోతే చెడు ఎదురైందన్న చందంగా సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఎదుటివారికి సారీ చెప్తారు కానీ వారు మిమ్మల్ని అర్థం చేసుకోరు. కోపం పెరుగుతుంది. చర్మసంబంధిత వ్యాధులు పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నేర్పు, నైపుణ్యంతో ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలపై దృష్టి సారిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూలం. శత్రుబలం తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాల అంశాలు అనుకూలం. పేరు, ప్రఖ్యాతులు ఉంటాయి. మనస్పర్థలను దూరం చేసుకునే అంశాలు కలసివస్తాయి. విద్యార్థులకు అనుకూలం. చేస్తున్న ఉద్యోగంతో పాటు పార్ట్ టైమ్ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయం చికాకుతో ఉంటుంది. కోపం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటిపోరు పెరుగుతుంది. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒకటికి రెండుసార్లు ప్రయత్నిస్తే తప్ప పనులు పూర్తికావు. మాట్లాడితే సరిపోయే పనులకోసం కూడా స్వయంగా వెళ్లాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. పెండింగ్ లో ఉన్న బిల్స్ మీద ఎక్కువగా దృష్టిసారిస్తారు. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. వృత్తి, ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి. అంచనాల మేరకు రోజంతా సాగుతుంది. దృష్టిదోషం పెరుగుతుంది. కనిపించని వస్తువులను వెతికితే కనిపించే అవకాశాలున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలసట పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయడం తగదు. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. అంచనాలు తారుమారవుతాయి. లాభనష్టాలుండవు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చర్చలు, కొనుగోళ్లు, వ్యాపారపరమైన అంశాలు, శుభకార్యాలు, మనస్పర్థలు పోగొట్టుకునే ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నింటా జాగ్రత్తలు అధికంగా పాటించాల్సి ఉంటుంది. ఎదుటివారి పట్ల మీ మంచితనమే మీ పాలిట శాపంగా మారుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. భార్యభర్తలు తక్కువగా మాట్లాడుకోవడం ఉత్తమం. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.







Tags:    

Similar News