JUNE 6 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దృష్టిదోషం పెరుగుతుంది. శత్రువులు, మిత్రులను;
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, మంగళవారం
తిథి : బ.తదియ రా.12.49 వరకు
నక్షత్రం : పూర్వాషాఢ రా.11.12 వరకు
వర్జ్యం : ప.10.05 నుండి 11.33 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.20 నుండి 9.12 వరకు, రా.11.09 నుండి 11.53 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.00 నుండి 12.35 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొనుగోళ్లపై దృష్టిసారిస్తారు. అందంపై మమకారం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులండవు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రెచ్చగొట్టేవారు పక్కనే ఉండటంతో కోపం పెరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో, మాటతీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒప్పందాలకు ప్రాధాన్యతనిస్తారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు పెరుగుతాయి. శ్రేయోభిలాషులతో ఒడిదుడుకులు ఎక్కువగా వస్తాయి. కీలక నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏం మాట్లాడాలన్నా ఆచితూచి వ్యవహరించాలి. బద్ధకం పెరుగుతుంది. ఎదుటివారినిఅంచనా వేయడంలో వైఫల్యం చెందుతారు. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలం. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వేగంగా పనులు పూర్తవుతాయి. దంపతుల మధ్య తగాదాలు పరిష్కారమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దృష్టిదోషం పెరుగుతుంది. శత్రువులు, మిత్రులను కనిపెట్టడంలో వైఫల్యం చెందుతారు. ప్రయాణాలతో అలసిపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహాన్ని కలిగిఉంటారు. వినోద కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. ఇంట, బయట బ్యాలెన్స్ చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు ఉన్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలకు అనుకూలం. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కొనుగోళ్లపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడులకు దూరంగా ఉంటారు. చేపట్టిన పనిలో ఫలితాలు రాకున్నా నిరుత్సాహపడరు. కొత్తపరిచయాలు ఉపకరిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.