Today Horoscope : కార్తీక పౌర్ణమి-చంద్రగ్రహణం కలిసిన రోజు ద్వాదశ రాశుల ఫలితాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు గ్రహణ దోషం లేదు కానీ.. రాశి అధిపతి అయిన చంద్రుడికి గ్రహణం ఏర్పడుతుంది. వృత్తి,
కార్తిక పౌర్ణమిని మహా కార్తీకి అని కూడా పిలుస్తారు. కార్తీక పౌర్ణమి నాడే చంద్రగ్రహణం ఏర్పడటం చాలా అరుదు. ఈ రోజు మధ్యాహ్నం 2.39 గంటల నుండి సాయంత్రం 6.19 గంటల వరకూ చంద్రగ్రహణ కాలం. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం వల్ల ద్వాదశ రాశుల్లో ఏయే రాశుల వారికి మేలు జరుగుతుంది ? అలాగే ఏయే రాశుల పై వ్యతిరేక ప్రభావాలని చూపుతుందో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది. రాహుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతున్న సమయంలో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఆదాయం కూడా నీళ్ల ప్రాయంగా ఖర్చైపోతుంది. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం మేషరాశిలో పుట్టినవారిపై 6 నెలల వరకూ ఉంటుంది. దోష నివారణకై పరిహారంగా.. కేజీ 1/4 మినుములు, కేజీ 1/4 బియ్యం గ్రహణకాలం పూర్తయ్యాక లేదా.. మర్నాడు బ్రాహ్మణుడికి దానమివ్వాలి. అలా చేయడం వల్ల గ్రహణ వ్యతిరేక ప్రభావం తగ్గుతుంది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు గ్రహణం వల్ల ఖర్చులు విపరీతంగా ఉంటాయి. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చంద్ర గ్రహణం వల్ల మంచి ఫలితాలు ఉండే అవకాశం లేదు. గ్రహణం పూర్తైన మరుసటిరోజు శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు లాభస్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. చంద్రగ్రహణం వల్ల ఈ రాశివారికి అంతా శుభమే జరుగుతుంది. ఎలాంటి పరిహారాలు పాటించవలసిన అవసరం లేదు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు గ్రహణ దోషం లేదు కానీ.. రాశి అధిపతి అయిన చంద్రుడికి గ్రహణం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు ముందుకు సాగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కూడా మంచికాలం మొదలవుతుంది. గ్రహణం పూర్తైన మరుసటిరోజున రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు గ్రహణం వల్ల లాభనష్టాలు ఉండవు. అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అన్నింటా మంచి ఫలితాలుంటాయి. గ్రహణం వల్ల ఎలాంటి దోషాలు లేవు. ఎలాంటి పరిహారాలు పాటించనక్కర్లేదు.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు చంద్రగ్రహణం అంత అనుకూలంగా లేదు. రాశిలోని అష్టమ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. కోర్టుకేసుల్లో వ్యతిరేక తీర్పులు రావొచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించే ముందు పునరాలోచించుకోవాలి. దోష పరిహారార్థం గ్రహణం వీడాక లేదా.. మరుసటి రోజున కేజీ 1/4 బియ్యం, కేజీ 1/4 నల్లని నువ్వులు దానం ఇవ్వాలి.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు చంద్రగ్రహణం వలన మంచి జరగదు. చెడు జరగదు. కానీ రాశిలోని సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందున జీవిత భాగస్వామితో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. అన్యోన్య దాంపత్యం ఉన్నవారిలో ఎవరో ఒకరికి అనారోగ్యం వచ్చే సూచనలున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలకు అనుకూలం కాదు. ఖర్చు నీళ్లప్రాయంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. దోష నివారణకై మరుసటిరోజు రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ చంద్రగ్రహణం అన్ని విధాలా సహకరిస్తుంది. రాశిలోని ఆరవ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందున ఆర్థిక సమస్యల నుండి బయటపడుతారు. శత్రుబలం తగ్గుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. విద్యార్థినీ, విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఈ రాశివారు ఎలాంటి పరిహారాలు చేయనక్కర్లేదు.
ధనస్సురాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం వలన మధ్యస్థ ఫలితాలుంటాయి. రాశిలోని పంచమస్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందున కుటుంబంలో తరచుగా సమస్యలు వస్తుంటాయి. పనుల్లో ఆటంకాలు, తగాదాలకు ఆస్కారం ఉంది. సంపాదన సరిపోకపోవడంతో ఇబ్బందులు పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులుండవు. ఎలాంటి పరిహారాలు పాటించనవసరం లేదు.
మకరరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం వల్ల అనుకూల ఫలితాలుండవు. రాశిలోని చతుర్థస్థానంలో గ్రహణం ఏర్పడుతుండటంతో.. ఎవరైతే బలంగా ఉంటారో వారే బలహీనంగా మారుతారు. ఉద్యోగ మార్పులు, కొత్తవ్యాపారాలు కలసిరావు. అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం వీడిన తర్వాత లేదా మరుసటి రోజున కేజీ 1/4 బియ్యం, కేజీ 1/4 నల్ల నువ్వులను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం మంచిది. మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవాలి.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ చంద్రగ్రహణం మూడో ఇంటిలో ఏర్పడుతుండటంతో పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. పెండింగ్ పనులు ముందు సాగుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, వృత్తి ఉద్యోగాల్లో ఈ గ్రహణం మేలు చేస్తుంది. ఎలాంటి పరిహారాలు పాటించనక్కర్లేదు.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం ద్వితీయంలో ఏర్పుడుతున్నందున వృథా ఖర్చులు పెరుగుతాయి. మాట నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. మోసపోయేందుకు అవకాశాలెక్కువ. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది. ఈ రాశి వారు రేపు మొదలు వచ్చే 6 మాసాలపాటు ప్రతిరోజూ శివాష్టోత్తరాన్ని పఠించడం మంచిది.