MAY 11 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు.

Update: 2023-05-11 04:17 GMT

telugupost horoscope

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, గురు గురువారం

తిథి : బ.షష్ఠి ఉ.11.27 వరకు
నక్షత్రం : ఉత్తరాషాఢ మ.2.36 వరకు
వర్జ్యం : సా.6.20 నుండి 7.50 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.04 నుండి 10.55 వరకు, మ.3.11 నుండి 4.02 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.00 నుండి 9.00 వరకు, సా.4.30 నుండి 5.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు ప్రధానంగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా ఉండవు, ప్రోత్సాహకరంగానూ ఉండవు. బాగా అలసిపోతారు. సహోద్యోగులతో ఏర్పడిన స్పర్థలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఏమరపాటుతనం పనికిరాదు. అప్పులివ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. పార్ట్ టైమ్ జాబ్స్ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు కలసివస్తాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. మీ ద్వారా జరిగే తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి విషయంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు, కుటుంబ పరమైన విషయాలు, కీలక విషయాలను వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి పని వాయిదా ధోరణిలో సాగుతుంది. బద్ధకం ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో వైఫల్యం చెందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం లభిస్తుంది. ఎదుటివారితో జరిపే మాటామంతీ, చర్చలు సాగిస్తారు. కీలక విషయాలు తెలుసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. ప్రతి పనిని సరైన సమయంలో పూర్తిచేస్తారు. పాత పరిచయాలు, పాతమిత్రులతో జరిపే చర్చలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బ్లూ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త లాభాలేమీ ఉండవు. మానసిక ప్రశాంతత, ఊరట లభిస్తాయి. కొత్తవిషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఎదుటివారు చెప్పేది అర్థంకాక గందరగోళానికి గురవుతారు. రోజంతా హాయిగా సాగిపోయే స్థితి ఉండదు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఉద్యోగపరంగా మంచి స్థితిగతులు ఏర్పడుతాయి. సంఘ గౌరవాన్ని కలిగి ఉంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.


Tags:    

Similar News