MAY 12 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో మోసాలకు ఆస్కారం ఎక్కువ.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, గురు గురువారం
తిథి : బ.సప్తమి ఉ.9.06 వరకు
నక్షత్రం : శ్రవణ మ.1.03 వరకు
వర్జ్యం : సా.4.48 నుండి 6.18 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.22 నుండి 9.14 వరకు, మ.12.38 నుండి 1.29 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.1.45 నుండి 2.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడి తగ్గుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. దంపతుల మధ్య తగాదాలు, విబేధాలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలం. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఎదుటివారితో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన తగాదాలు, వృథా ఖర్చులుంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కీలక నిర్ణయాలు, శుభకార్యాల విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కీడెంచి మేలెంచాలన్న విధంగా ఆలోచిస్తారు. ఫిర్యాదులు, న్యాయపరమైన అంశాలకు అనుకూలంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. బాధ్యతలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉచిత సలహాలిస్తారు. అనుభవం ఉన్నా, లేకపోయినా వ్యాపారాలపై మొగ్గుచూపుతారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో మోసాలకు ఆస్కారం ఎక్కువ. వైట్ కాలర్ జాబ్స్, సంతకానికి విలువైన వృత్తిలో ఉన్నవారు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. బద్ధకంతో లేని ఇబ్బందుల్ని కూడా కొనితెచ్చుకుంటారు. అర్థం చేసుకునేవారు లేరన్న బాధ పెరుగుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. విసుగు, చిరాకు, కోపంతో రోజంతా గడుస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వసతులను సమకూర్చుకుంటారు. స్థిర చరాస్తులను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉపయోగకరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అప్పులను తీర్చేందుకు ఆలోచిస్తారు. ఒదిగి ఉండాలన్న ఆలోచన ఉండదు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు విపరీతం. మీరు తెలుసుకున్న అంశాలను 10 మందికీ తెలియజేస్తారు. ఖర్చులను నియంత్రించాలని ఆలోచిస్తారు. రహస్యాలను మెయింటేన్ చేయాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు రొటేషన్లు ఇబ్బందిగా సాగుతాయి. డబ్బు సమయానికి అందకపోవడంతో ఇబ్బంది పడుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. ఇతరుల సలహాలు తీసుకుంటారు. శుభకార్యాల విషయంలో తుది నిర్ణయానికి వస్తారు. పరిచయాలను విస్తరించుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.