MAY 19 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. చేస్తున్నఉద్యోగంతో పాటు పార్ట్ టైమ్ ఉద్యోగ..

Update: 2023-05-18 23:30 GMT

may 19th horoscope in telugu

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, గురు శుక్రవారం

తిథి : వైశాఖ అమావాస్య రా.9.25 వరకు
నక్షత్రం : భరణి ఉ.7.29 వరకు
వర్జ్యం : రా.7.46 నుండి 9.24 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.20 నుండి 9.12 వరకు, మ.12.38 నుండి 1.29 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. కీలకమైన పనులను మధ్యాహ్నం 1.30 గంటలలోపు పూర్తిచేసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలను, శుభకార్యాలను మద్యాహ్నానికి మార్చుకోవడం మంచిది. నిరుత్సాహంతో మొదలై ఉత్సాహంగా రోజు పూర్తవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 తర్వాతి నుంచి ఖర్చులు బాగా పెరుగుతాయి. నిద్రాహారాల్లో అవస్థలు ఉంటాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల పరంగా తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. సంతానం విషయంలో తగాదాలు, విభేదాలు పరిష్కారమవుతాయి. విహారయాత్రలు, వినోద కార్యక్రమాలపై ప్లాన్ చేసుకుంటారు. నిద్రలేమి బాధిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల తర్వాతి నుంచి అనుకూలం. గౌరవం పెరుగుతుంది. పూర్తికావనుకున్న పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉపయోగకరమైన ఖర్చులుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సానుకూలంగా ఉంటుంది. మీరు చెప్పే మాటల్ని ఎదుటివారు గౌరవించాలంటే మధ్యాహ్నం వరకూ ఆగాలి. మధ్యాహ్నం తర్వాతి నుండి ముఖ్యమైన పనులపై దృష్టిపెట్టడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల వరకూ అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో చర్చలు, కొత్తనిర్ణయాలు, కొనుగోళ్లకు, పరిచయాలకు మధ్యాహ్నం వరకూ సానుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. చేస్తున్నఉద్యోగంతో పాటు పార్ట్ టైమ్ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రేమలు ఫలిస్తాయి. లౌక్యంగా వ్యవహరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 తర్వాతి కాలం అనుకూలిస్తుంది. క్రయవిక్రయాలు సానుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. రిస్క్ కు దూరంగా ఉండాలి. తక్కువగా మాట్లాడాలి. ఇంట్లో ఉన్నవారితో విభేదాలు రావొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 వరకూ అనుకూలం. ఆ తర్వాతి నుంచి పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు చోటుచేసుకుంటాయి. శరీరంలో తెలియని బద్ధకం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 తర్వాతి నుంచి వాహనాల పనులు, కోర్టు కేసులకు, తగాదాల పరిష్కారాలకు అనుకూలం. క్రయవిక్రయాలు సాగిస్తారు. ఇంటి అలంకరణపై దృష్టిపెడతారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.


Tags:    

Similar News