MAY 1 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కెరియర్ పరంగా అధిక జాగ్రత్తలు..

Update: 2023-04-30 23:30 GMT

may 1st horoscope in telugu, telugupost horoscope, daily horoscope

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, సోమవారం

తిథి : శు.ఏకాదశి రా.10.06 వరకు
నక్షత్రం : పూర్వఫల్గుణి సా.5.47 వరకు
వర్జ్యం : రా.1.32 నుండి 3.15 వరకు
దుర్ముహూర్తం : మ.12.38 నుండి 1.28 వరకు, మ.3.10 నుండి 4.00 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 5.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. నా అనుకున్న వారితోనే మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి. ఎవరిదగ్గరా తలవంచి ఉండే అవకాశాలు లేవు. విద్యార్థులకు, లా ప్రాక్టీస్ చేసేవారికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతాయి. అంచనాలు తారుమారవుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రాహారాల విషయంలో ఏమరపాటు పనికిరాదు. అనవసరమైన విషయాల్లో మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి. వృథా ఖర్చులుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాల అంశాలు అనుకూలం. ప్రతి విషయంలో లోతుగా ఆలోచిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులకు అనుకూలం. పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. మానసిక సంతోషాన్నిచ్చే సంఘటనలు జరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అవసరమైన ఖర్చులే చేస్తారు. కష్టం పెరుగుతుంది. నష్టాలుండవు. కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. గౌరవ, మర్యాదలను కలిగి ఉంటారు. ఎదుటివారితో వచ్చే స్పర్థలు తొలగించుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చిరాకు పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు అధికంగా శ్రమించాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రిజిస్ట్రేషన్లపై దృష్టిసారిస్తారు. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. తీసుకునే నిర్ణయాలు అన్నివిధాలా కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కెరియర్ పరంగా అధిక జాగ్రత్తలు తీసుకుంటారు. సొంతిల్లు, వాహనాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆటంకాలు తొలగిపోతాయి. బాధ్యతలు సంతృప్తిగా నిర్వహించామన్న తృప్తి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచిచెడుల కలబోతగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడితే ఫలితాలు అందుకుంటారు. ప్రతి విషయంలో తృప్తి, ప్రశాంతత తగ్గుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. సాధారణంగా గడిపే ప్రయత్నం చేయాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. ఆర్థికవిషయాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారస్తులకు కోరుకునే వెసులుబాటు లభిస్తుంది. లలిత కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గ్రంథపఠనంపై ఆసక్తి చూపుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బాధ్యతలు నెరవేర్చుకునే ప్రయత్నాలకు, రిజిస్ట్రేషన్లకు, మాటపట్టింపులను పరిష్కరించుకునేందుకు అనుకూలం. ఈ రోజు యోగదాయకంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.




Tags:    

Similar News