MAY 20 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నా పని జరిగిందా లేదా అని స్వార్థంగా ఆలోచించడం మంచిది. ఏ పని చేస్తే..;
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, జ్యేష్ఠమాసం, శనివారం
తిథి : శు.పాడ్యమి రా.9.34 వరకు
నక్షత్రం : కృత్తిక ఉ.8.03 వరకు
వర్జ్యం : రా.11.44 నుండి 9.24 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.46 నుండి 7.29 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.45 నుండి 11.30 వరకు, సా.5.00 నుండి 5.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. అలసట పెరుగుతుంది. రొటేషన్లు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా శ్రేయస్కరం. కొట్లాటలు తగ్గుతాయి. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విహారయాత్రలు, వినోద కార్యక్రమాలు సానుకూలంగా సాగుతాయి. శుభకార్యాల ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏం మాట్లాడినా తగాదాలొస్తాయి. మాటతీరు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. శరీరం అలసిపోతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా శ్రేయస్కరం. స్వయంకృతాపరాధం తో ఇబ్బందులు కలుగుతాయి. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. కష్టమైనా సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఇంట్లోని వస్తువులను రీప్లేస్ చేస్తారు. పాత, కొత్త పరిచయాలు అభివృద్ధి చెందుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. వ్యాపరస్తులకు కాలం అనుకూలం. ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది. మానసిక ఊరట ఉంటుంది. దంపతుల మధ్య తగాదాలను పరిష్కరించుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నా పని జరిగిందా లేదా అని స్వార్థంగా ఆలోచించడం మంచిది. ఏ పని చేస్తే.. అది ఎదురొస్తుంది. కారణాలు లేకపోయినా చిరాకు పెరుగుతుంది. మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. అధికారుల మెప్పు పొందుతారు. మనసా, వాచ కర్మణ నమ్మినదానినే ఆచరిస్తారు. రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాల అంశాలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఎదుటి వారి నుంచి కావాల్సినవి తీసుకుంటారు. దంపతుల మద్య అన్యోన్యత తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు, తగాదాలు పెరుగుతాయి. మానసిక, శారీరక అలసట పెరుగుతాయి. వైద్య సంప్రదింపులు తప్పవు. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బద్ధకం పెరుగుతుంది. పనులు వాయిదా పడతాయి. జీవితంలో వినోదం ఉండాలన్న చందంగా ఆలోచిస్తూ సమయం వృథా చేస్తారు. ఎలాంటి ప్లాన్లను ఆచరణ చేయరు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా కలసివస్తుంది. మనస్ఫర్థలను పరిష్కరించుకునే ప్రయత్నాలు, ఆర్థిక వెసులుబాటు ప్రయత్నాలు కలసివస్తాయి. బంధుమిత్రులతో గడుపుతారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.