MAY 24 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని మెప్పించేందుకు చేసే..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బుధవారం
తిథి : శు.పంచమి రా.3.01 వరకు
నక్షత్రం : పునర్వసు మ.3.07 వరకు
వర్జ్యం : రా.12.03 నుండి 1.50 వరకు
దుర్ముహూర్తం : ఉ.11.47 నుండి 12.38 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.10 నుండి 9.40 వరకు, సా.4.00 నుండి 4.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయాన్ని కీడెంచి మేలెంచాలన్న విధంగా ఆలోచిస్తారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అయోమయానికి గురవుతారు. ప్రతి విషయంలో ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. తెగింపుతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టుకేసులకు అనుకూలం. తీరని సమస్యలపై దృష్టి సారిస్తా ఫలితం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైన వాగ్వాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉన్నవారు పట్టించుకోవడం లేదన్న ఆలోచనలు పెరుగుతాయి. మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని మెప్పించేందుకు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కీడెంచి మేలెంచాలన్న విధంగా ఆలోచిస్తారు. రాతపోతల వ్యవహారాల్లో, దంపతుల మధ్య మధ్యవర్తిత్వాల్లో సానుకూలతలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. మేలు కంటే చెడు జరిగేందుకే అవకాశాలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. సహకరించే వర్గం చేరువలో ఉంటుంది. క్రయవిక్రయాలు కలసివస్తాయి. చురుగ్గా ఉంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. తృప్తి మాత్రం తక్కువగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సమీకరణాలు నేర్పుగా చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకూల స్థితిగతులు ఏర్పాటు చేసుకుంటారు. మిమ్మల్ని ఎవరైనా ఇరికించాలనుకుంటే.. మీరే వారిని ఇరికిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు ఉన్న ఆలోచనలు ఇప్పుడు ఉండవు. సంఘంలో గౌరవం ఉంటుంది. కొన్ని ఊరటనిచ్చే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీరంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఖర్చులు నియంత్రించుకోకపోతే ఇబ్బందులపాలవుతారు. శత్రుబలం పెరుగుతుంది. దృష్టిదోషం అధికమవుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల స్థితిగతులు ఏర్పడుతాయి. ఉద్యోగంలో ఇబ్బంది పెట్టేవారిని ఎదుర్కొంటారు. ఇంట, బయట మనసుకు నచ్చినవిధంగా నడుచుకుంటారు. దంపతుల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తప్పదు అనుకున్న పనులపై మాత్రమే దృష్టిసారించడం మంచిది. అనవసరమైన వివాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువ. వ్యాపార రంగాలవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.