MAY 27 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు అనుకూలించవు.;
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శనివారం
తిథి : శు.సప్తమి ఉ.7.42 వరకు
నక్షత్రం : మఘ రా.11.41 వరకు
వర్జ్యం : ఉ.10.15 నుండి 12.02 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.45 నుండి 7.28 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.50 నుండి 11.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు అనుకూలం కాదు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎంతకష్టపడినా ప్రతిఫలం రావట్లేదన్న విధంగా సంఘటనలు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడతాయి. అనవసరమైన మాటలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. మీ ముందు పొగిడే వారు, వెనుక విమర్శించేవారు పెరుగుతారు. ఆర్థికంగా రోజంతా ఒడిదుడుకులుగా కొనసాగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొనుగోళ్లు, అమ్మకాల అంశాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు మెరుగైన కాలం.ప్రతి విషయాన్ని ముందుగానే ఊహిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మాటతీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు పెట్టుబడులు, రొటేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండానే రహస్యాలు చెప్పేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాస్త ఊరటగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. క్రయవిక్రయాలు, శుభకార్యాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈరోజును సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు అనుకూలించవు. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ. విన్న విషయాలను నమ్మితే ప్రమాదంలో పడతారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలు కలసివస్తాయి. ఉన్నంతలో లైఫ్ ను ఉల్లాసంగా, తృప్తిగా సాగిస్తారు. దేనిని పట్టించుకోరు. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. కీలకమైన చర్చలు జరుపుతారు. శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. మంచి ప్రణాళికలు రూపొందిచుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఊరట లభిస్తుంది. ఏదేమైనా రహస్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రుబలం పెరుగుతుంది. ఆశించిన అప్పులు సకాలంలో అందుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మంచి చెప్పినా.. చెడుగానే ఆలోచిస్తారు. పనులు వాయిదా వేసుకోవడం మేలు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు, ఉద్యోగ ఉన్నతి ప్రయత్నాలకు అనుకూలం. అన్నింటా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శత్రుబలాన్ని తగ్గించుకుంటారు. రిజిస్ట్రేషన్లకు, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు యోగదాయకంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.