MAY 3 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆచితూచి మాట్లాడాలి. ఇంట్లోకంటే బయటే..

Update: 2023-05-02 23:30 GMT

may 3rd horoscope in telugu

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బుధవారం

తిథి : శు.త్రయోదశి రా.11.46 వరకు
నక్షత్రం : హస్త రా.8.51 వరకు
వర్జ్యం : తె.5.04 నుండి 6.43 వరకు
దుర్ముహూర్తం : ఉ.11.47 నుండి 12.38 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.10 నుండి 9.50 వరకు, సా.4.00 నుండి 4.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇచ్చిన అప్పులు వసూలు చేస్తారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. అయోమయంతో ఉన్న విషయాల్లో స్పష్టత వస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన వాగ్వివాదాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యమైన విషయాలకంటే అనవసరమైన విషయాలే ప్రాధాన్యం సంతరించుకుంటాయి. మీరేం మాట్లాడినా తప్పుపడతారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు వృథాగా ఉంటాయి. గతంలో చేసిన అప్పులు భారంగా పరిణమిస్తాయి. ఇంట్లో ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. 10 మందితో మొదలుపెట్టే ఏ పనీ పూర్తికాదు. చిన్నపాటి అనారోగ్యమే అయినా శ్రద్ధ వహించాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలే అధికంగా ఉంటాయి. శ్రమ ఎక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు ఉపయోగకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఊరట ఉంటుంది. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ముందంజలో ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆచితూచి మాట్లాడాలి. ఇంట్లోకంటే బయటే ఎక్కువ కాలక్షేపం చేస్తారు. బాల్య స్నేహితులు, అభిమానించే వ్యక్తులు అంటీముట్టనట్టుగా ఉండటంతో మనసు నొచ్చుకుంటుంది. ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విచిత్రంగా ఉంటుంది. కావలసిన అన్ని వసతులు, సౌకర్యాలున్నా వాటిని అనుభవించే తీరిక ఉండదు. అర్థవంతమైన ఖర్చులుంటాయి. ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్తారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాస ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉండదు. ఇంట, బయట శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. ఉద్యోగంపై ఫోకస్ పెడతారు. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు కార్యరూపం చేసే ప్రయత్నాలు, ఆర్థిక సర్దుబాట్లకు, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన విషయాలకు ఆకర్షితులవుతారు. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తే ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనుకూలంగా ఉంటుంది. స్నేహాలను పెంచుకునేందుకు, ప్రేమలకు, ఎదుటివారితో మాట్లాడేందుకు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. బద్ధకానికి దూరంగా ఉంటే అంతా బాగుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు ప్రతి విషయంలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సహాయం చేసేవారి సంఖ్య నామమాత్రంగా ఉంటుంది. రోజంతా సాధారణంగా కొనసాగుతుంది. స్థిరమైన నిర్ణయాలకు మంచికాలం కాదు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాల్లో మంచి గ్రోత్ ఉంటుంది. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.





Tags:    

Similar News