MAY 5 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం..

Update: 2023-05-04 23:30 GMT

telugupost horoscope

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్రవారం

తిథి : వైశాఖ పూర్ణిమ రా.11.00 వరకు
నక్షత్రం : స్వాతి రా.9.35 వరకు
వర్జ్యం : రా.3.05 నుండి 4.39 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.23 నుండి 9.14 వరకు, మ.12.37 నుండి 1.28 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 5.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎక్కువగా ఆలోచిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలుంటాయి. అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాల అంశాలు అనుకూలంగా ఉంటాయి. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దగా ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న తగాదాలుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు ఎక్కవ. ఏం మాట్లాడినా ఇబ్బందికరంగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదాపడుతుంటాయి. వాహన మరమ్మతుల్లో ఏమరపాటు పనికిరాదు. ఒంటరిపోరాటం చేస్తున్నారన్న విధంగా సంఘటనలు ఎదురవుతాయి. రిస్క్ కు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ల కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న లోన్లు మంజూరవుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు లేతనీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. గడిచిన సంఘటనలను నెమరువేసుకుంటారు. శుభవార్తలు వింటారు. పరిచయాలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయాన్నీ పాతరోజులతో బేరీజు వేసుకుని ఆలోచిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మనిషొక చోట మనసొక చోట అన్నట్లుగా ఉంటారు. ప్రయాణాల్లో వస్తుభద్రత ముఖ్యం. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పని మీది.. పేరు మరొకరికి రావడంతో నిరుత్సాహ పడతారు. పెట్టిన వస్తువులు పెట్టినచోట కనిపించక ఒత్తిడికి గురవుతారు. వివిధరకాల పనులతో సతమతమవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. నూతన వ్యాపారాలకు మేలు కలుగుతుంది. కాంట్రాక్ట్ రంగంవారికి మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం ఒడిదుడుకులుగా ఉన్నా అధిగమిస్తారు. శత్రువులెవలో, మిత్రులెవరో తెలుసుకుంటారు. మానసిక అప్రశాంతత మినహా పెద్దగా ఇబ్బందులుండవు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఊరట కలుగుతుంది. అనవసరమైన వివాదాలు చోటుచేసుకుంటాయి. విద్యార్థులు అధిక శ్రద్ధ వహించాలి. కాంట్రాక్ట్ రంగం వారికి ఊరట కలుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రహస్యాలను రహస్యంగా ఉంచుకోవాలి. వృథా ఖర్చులు, అనవసరమైన మాటపట్టింపులు పెరుగుతాయి. ఒత్తిడి తగ్గ ఫలితం ఉండదు. ఉద్యోగ, వ్యాపారాల్లో యథాతథంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.





Tags:    

Similar News